Monday, October 11, 2021

మత్తకోకిల పద్యాలు , లో దుర్గమ్మ స్తుతి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

ప్రక్రియ :  మత్త కోకిల పద్యాలు

శీర్షిక  : నవరాత్రి దుర్గమ్మ.

శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీనికేతని  మానినీ
వేల పుాలను జుట్ట వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర  వేళ బోనము నీకిడీ
శీల బంగరు బాట చుాపెడు బాల శ్రీగజ గామినీ ॥

గంధ పుాలతొ స్తోత్ర పుాజిడి కాళి రక్షణ కోరితీ
మంద గామిని ఇందు సోదరి మంత్ర ముార్తివి నీవనీ
వంద నమ్మిడి నిమ్మ మాలల బంధ మేసెద మొాఘనీ
కుంద రదనీ వేల్పు వైమము  కుార్మి బ్రోవవె పావని ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
శంక రుాసతి  శాంకరీ ఘని శాంతి నీయవె పావనీ 
బింక మేలనె భాగ్య రాశివి భీకరీ భగళేశ్వరీ
జంగ మాంగని  చారు హాసిని  చక్ర వాసిని తీరథీ ॥

రమ్మ నంటిని రాగ దేలనె రమణి శ్రీహరు కామినీ
నమ్మి వేడితి నమ్మ  శాంభవి అమ్మి ఆపద బాపవే
అమ్మ చేకొను వందనమ్మిదె  ఆర్తత్రాణ పరాయణీ 
లెమ్మ తొమ్మిది రుాపు లెత్తిన కొమ్మ అందుకొ ఆరతీ॥


 శీర్షిక  : ముద్దు కృష్ణ .

భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥

No comments:

Post a Comment