Monday, October 11, 2021

కుల రక్కసి

అంశం:" కుల రక్కసి"
శీర్షిక :  భ్రష్టుపట్టిన సమాజం.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021

నేటి సమాజంలో కుల వివక్షతల
వివాదాలతో రాజ్యాంగం రణరంగమౌతోంది
కుల రక్కసి చేస్తున్న స్వైరవిహారం
మానవత్వాన్ని కుాకటి వేళ్ళతో కుాల్చేసింది.॥
కులమత వివక్షతల వేడి నిండిన బాటలో 
మనిషి స్వార్ధ పుారిత వ్యుాహ రచనలతో
మంది ముార్ఖత్వాన్ని  మహోన్నతంగా వాడుకుంటున్నాడు.
ఫలితం..
అక్షర జ్ఞానం లేనివారి  అనాలోచిత పాలనలో
అసందర్భ రాజకీయాలకు ఆహుతౌతున్న జనం.
గద్దె కెక్కిన నిరక్షరాస్యుల పాలనలో పెరుగుతున్న  రౌడీయిజానికి భ్రష్టుపడుతున్న  యువత భవిత॥
అధికార బలానికి  తలవంచిన న్యాయ వ్యవస్థల్లో
తీర్పులోపాల చక్రాల కింద నలిగిపోతున్న న్యాయం
అక్షరాస్యత, ఆకలి నిండిన ఆక్రోశాలతో
ఆత్మ గౌరవాన్ని  అమ్ముకు బతకుతున్న వైనం.॥
రిజర్వేషన్ల పేర్లతో అర్హత లేనివాడందుకుంటున్న
సౌకర్యాలకు పడిపోయిన అక్షరం కన్య,
మారుతున్న  జనాల మధ్య చావలేక  బతుకుతుా 
బుాతు నిండిన భావ జాలంతో భాషకు
వలువలు విప్పుతుా విహరిస్తున్న  దౌర్జన్యం.
వెనుకబడ్డ వారిని ముందుకు తెచ్చే యత్నంలో
సభ్య సమాజానికి శిలువ వేస్తున్న  అవివేకం.
ఆగని కులాంతర వివాహాలకు రాజుకుంటున్న జాతి
వైరాలకు ఆహుతౌతున్న అమాయక యువత॥
అణగారిన సమాజంలో అసభ్య పదజాలాల
ఆవిష్కరణకు అర్ఘ్యం పోస్తుా ఆడతనాన్ని
అపహాస్యం చేస్తుా ఆడుకుంటున్న  క్రౌర్యం ॥
మార్పురాని సమాజాన్ని మార్చే ప్రయత్నంలో
అసువులు బాసిన  ఉద్యమవీరుల బీటలుబారిన
సమాధి చిహ్నాలు మరచిపోయిన మానవత్వాన్ని 
గుర్తు చేస్తుా కుల రహిత సమానత్వ విలువల్ని
తెలియపరచలేక మౌనంగా కన్నీరు కారుస్తున్నాయి ॥

No comments:

Post a Comment