శీర్షిక:" దివ్య తేజోమయి"
ధవళ వర్ణ వస్త్రధారణతో
పద్మం పైన ఆసీనురాలై
మందస్మిత వదనంతో
కాంతులీనుతూ
పరమ సాత్విక మూర్తిగా...
అక్షయమైన సిరుల్ని ప్రసాదించే
"మహా సరస్వతి నమోస్తుతే"....!!
అపరిమితమైన స్వచ్చతకూ,
సృజనకూ,
నిష్కల్మషత్వానికి నిదర్శనమై
"నా రూపమే నా సందేశమని"
ఎన్నో అంశాల్ని ఉపదేశిస్తూ
అధిష్టాన దేవతగా
మోక్ష సిద్ధిని ప్రసాదించే ....
"సిద్ధి సరస్వతి నమోస్తుతే"...!!
అజ్ఞాన తిమిరాంధకారాన్ని
దూరం చేసి.....
విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని
నిరంతరం శివానుజగా
ప్రవహింపజేసే.....
ధారణ సరస్వతి నమోస్తుతే...!!
అవిద్య ఉన్నచోట
దృక్కులు ప్రసరిస్తూ
విద్యా వాటికగా....
అజ్ఞానం నెలకొన్న హృదయానికి
అనుగ్రహం అందిస్తూ
జ్ఞాన వేదికగా ....
జడత్వం నిండిన చోట
కరుణ పల్లవిస్తూ
చైతన్య దీపికగా...
చీకటి ఆవరించినప్పుడు
తేజస్సు ప్రసరిస్తూ
వెలుగు వాహిక గా....
నాలుగు దిక్కులు
వేదమాతగా పరిఢవిల్లే
"నీల సరస్వతి నమోస్తుతే"....!!
సత్వగుణంతో వర్ధిల్లుతూ
సౌమనస్య భావాలతో
సౌజన్య మనస్కులై
విలసిల్లాలని ప్రబోధించే
"దివ్య తేజోమయి"
సరస్వతీమాత నమోస్తుతే....!!
నలిగల రాధికా రత్న
No comments:
Post a Comment