శీర్షిక : మమతల మంటలు.
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది?
సమతా మమతా లేని జగతిలో
మందును ఎవరిని అడిగేది...?॥
రక్త బంధపు, అనురాగములే
నిలిచెను స్వార్ధపు చింతనలై...,
అర్ధము లెరుగని అవేశములై ,
అర్ధము కొరకు అనర్ధములై....॥
అమ్మా, అక్కా, చెల్లీ,. తమ్ముల
బంధాలు బరువై , పలచబడే !
అన్నలు ,అయ్యలే , వావీ వరుసల
బంధపు విలువకు శిలువేసే॥
కామపు కాటుల ,మంటలు రగిలే.
దారుణ హత్యలె , ఆటగ చెలగే.
ఏసిడ్, దాడుల ఏడ్పుల గోడులె,
నిత్య కర్మ , క్రుత్యములై మిగిలె ॥
న్యాయం ,ధర్మం, కనులు ముాసుకొనె,
జాతి జగడములె జగతిని నిండె.
నీతి -న్యాయముల, బాటలు బురదై,
బ్రతుకు శ్వాశలే బరువాయె ॥
నారీ చింతన నెగడై ఎగసే.
మనిషే మ్రుగమై చెలరేగే....,
చావుల చితి గని, భరతావని-
కన్నీరె-ప్రళయమై- కోపించే ॥
చీకటి- వెలుగుల జీవన గతిలో..
నగవుల విలువలు దిగజారే ..
భార్యా బిడ్డల బాధ్యత , విధులే
బరువై , బ్రతుకులే చితులాయే .. ॥..
అమ్రుతమె కరువై , విషపు జ్వాలలే
మింటికెగసె , హ్రుది మైలపడె..
మనిషే మనిషికి , శత్రువు కాగా
"పగ" లే...మనిషికి విధులాయే.॥
నాదీ -నీదను వాదపు సమరాన
రక్తమె ఝరులై ప్రవహించే..
ధనమే జగతిని సాశించినదై...
వైరపు మంటల నెగదోసే ॥
మమతల మాటున మధన పడే
నా మనసుకు ఏమని చెప్పేదీ..?
ఎవరికి ఎవరుా కాని జగతిలో
ఎంత కాలమని బతికేది..॥
రగిలిన గాయపు మంటల నార్పగ
మందును ఎవరిని అడిగేదీ....?॥
మమతల కొలిమిలొ కాలుతున్న ఈ
మనసుకు ఏమని చెప్పేది..?॥
---------------------------------
రచన, శ్రీమతి
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
---------------------------
No comments:
Post a Comment