Friday, October 8, 2021

రక్తదానం విజేతలు..(సున్నితం ప్రక్రియ ).

"రక్తదానం " అంశంపై సున్నితాలురాసిన వారందరికీ అభినందనలు .
ద్వితీయ విజేతలు.

 *ద్వితీయబహుమతి*🥈💐 
పుల్లాభట్ల జగదీశ్వరి🥈💐💐
గీతారాణి అవధానుల 🥈💐
తంగెళ్లపల్లి ఆనందాచారి 🥈💐

సాహితీ బృందావన జాతీయ వేదిక లో

అంశం : రక్తదానం.

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త. : శ్రీ నెల్లుట్ల సునీతగారు. 

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర

మహిలో  మనుషులు వేరైనా 
 ప్రవహించే రక్తం ఒక్కటేనన్న
 మాటకు నిదర్శనం  రక్తదానం
 చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

కుల-మతాల తేడాచుాపని సమానత్వం
అందరిలో ప్రవహించే  జీవామృతం.
నిజమిదేనని తెలుసుకోవాలి మనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

మానవత్వంలో దాగిన  యజ్ఞంఫలం.
ధనమిచ్చినా దొరకని  మధురసం
అరుదైన  పరోపకార వరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

పౌష్టికాహారం రక్తపుష్టికి  ముాలం.
అహారబలం రక్తశుద్ధి  కారకం
రక్తదానం , జీవితమే ధన్యం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

మనుషులంతా ఒక్కటంటుా నిరుాపించేది
మానవత్వానికి నిదర్శనమై నిలిచేది
రక్తహీనులకు బ్రతుకునిచ్చేది రక్తదానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

No comments:

Post a Comment