Friday, October 29, 2021

యువతపై డ్రగ్స్ ప్రభావం.

అంశం : యువత పై డ్రగ్స్ ప్రభావం .
శీర్షిక : ఆగని చీకటి వ్యాపారం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

మాదకద్రవ్యాలతో  మారణహోమం.
మంచి పై చెడు సాధించిన విజయం.
సమాజంలో మార్పు కోరిన మనిషి విజ్ఞానం
మత్తు సుఖాలకై ఎందరి జీవితాలో పణం ॥

మానవ మేధావి చేసిన  మత్తు మధనం.
అన్ని బంధాలనుా కాలదన్నే ఖర్చు బేరం.
తనను తాను మర్చిపోయే స్థితిలో విహారం.
అన్నీ మరచిన మత్తులో చచ్చుబడిన జీవితం.॥

చట్టవిరుద్ధంగా మాదకద్రవ్యాల దుర్వినియొాగం, 
హెరాయిన్, కొకైన్, పొగాకు వంటివి విషతుల్యం.
పరిమితిని మించిన అలవాటు వల్ల అపాయం.
ఆరోగ్యనాశనానికి దారితీస్తున్న ఆనంద విషం ॥

ఐక్యరాజ్యసమితి ద్వారా -మాదకద్రవ్యాల
వ్యసన విధానాలపై చర్చ.
ఫెడరల్‌– గవర్నమెంట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్
చేస్తున్న అధ్యయనాలకు లొంగని వ్యవస్థ.॥

ధన,అధికార బలాల స్వార్ధ పుారిత వ్యాపారం.
భరత భవిత  బయటకురాలేని పద్మవ్యుాహం.
డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న బలహీనం.
విందు వినోదాలలో ప్రాథమిక వ్యసనంగా మారి
స్వీయ నియంత్రణను కోల్పోతున్న యువతరం॥.

"డ్రగ్స్"....
నేటి సమాజంలో మొాడరన్  విలాసం.
వింత పశు ప్రవర్తనల విధి రాయని శాపం.
ఆపాలనుకున్నా ఆగని చీకటి వ్యాపారం.
అదోగతిపాలౌతున్న జనం-జనం మనం-మనం ॥

No comments:

Post a Comment