Saturday, November 6, 2021

దాశరథీ కృష్ణమాచార్యులు

6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు 
శీర్షిక : ప్రజాకోటి.

166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం 
పద్య విన్యాసాలతో  పదపోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై  ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి  నిదర్శనం . 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర  గర్భంలో  బడబానలం  
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.


*****************************




రుద్రవీణ   మ్రొాగించిన అగ్నిధారలో
ధ్వజమెత్తిన కవితా పుష్పకం
కవితోద్యమాలకు సాహిత్య పురస్కారం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మార్పు  తీర్పుతో రచనలు-
రాష్ట్ర, కేంద్ర  అకాడమీలలో 
గెలుచుకున్న సాహిత్య  బహుమతులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నాజీలను మించిన నైజామొాడికి….
గోల్కొండ ఖిల్లా కింద 
గోరీ కట్టిన కలం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మాపు  కురిసిన మంచులోన
గప్పుమని   క్రమ్మిన  నిప్పుమంటలు .
దాశరధీమాట దిశమార్చిన  బాట 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

సాహిత్య అకాడమీల గ్రహీత
అభిమాన  సినీ  గేయరచయిత
దాశరధి కవితోద్యమాల పద్యపిత
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నిన్ను గెలవలేక రైతన్నా……
నిజాం కూలింది కూలన్నంటుా
విడచిన  తుది శ్వాశ
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

************

No comments:

Post a Comment