Monday, November 8, 2021

బాల...బేల..

బాల భారతం 

శీర్షిక : వినుమ మాట.

చిట్టి పొట్టి బాల చిన్నారి సిరిబాల
చిందు లేసె జుాడు చింద నగవు
అన్య మెరుగ రేమి అమ్మ ఒడినిచేర
అమ్మె  లోకమాయె, ఆటె బ్రతుకు ॥

అడు కున్న వయసు ఆటపాటలె సున్న 
బతుకు పుస్త కాల  బరువు మిన్న
ముద్దు మాట పోయె ముాలబడె మురిపాలు
 బుడత వయసు బుద్ధి బురద గుంట ॥
 
చెడెను బ్రతుకు బాట చరవాణి చేగొన 
విద్య ముాల బడెను  విడిచె సిగ్గు
పలుక రాని మాట  పతనమౌ నదిబాట
వినరు చెప్పిన మాట వింత నడత ॥

బ్రతుకు భవిత నెంచ  భారమ్మ దేగాద 
వినరె గురువు మాట విశ్వ మెరుగ.
తల్లిదండ్రు లెగద తగు బోధనలు జేయు
మార్గదర్శకులిల  మనరె మాట  ॥


.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.

హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన

No comments:

Post a Comment