Monday, November 15, 2021

అర్జునుడు.

మహతీ సాహితీ కవి సంగమం
మ.సా.క.సం.19
కవిత సంఖ్య 3.
11/11/2021
అంశం: పాండవ మధ్యముడు.
ప్రక్రియ: ఇష్టపది .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

దేవేంద్ర నందనుడు  దేవి కుంతీ సుతుడు
పాండవుల మధ్యముడు పరమాత్ము సఖుడితడు॥
బహు బలుడు,తేజుండు బాణాస్త్రధారుండు
సాత్యకీ సఖుడితడు  సరి సవ్యసాచితడు ॥

అందమైన వానిగ ఆరోగ్యవంతునిగ 
పాండవుల అనుజునిగ పతి అతడు ద్రౌపదికి ॥
విలువిద్య ఘనునకుా వినయశీలులు సతులు.
శుభద్ర , చిత్రాంగద  శుభము లొసగెడువారు .॥

అజ్ఞాత వాసాన అతడేగ బృహన్నల
మహా భారత కధకు మహిని కీలకు డితడు
అరణ్య వాసమునదె  ఆచరించీ తపము
పరమేశు మెప్పించి పాశుపతాస్త్రమొందె ॥

కర్తవ్య నిష్ట నిడు కార్యసాధకుడితడు
కడు బంధు ప్రీతి నిడు కరుణ గల్గిన నరుడు.
సంగ్రామ సమయాన సరి బంధువుల జుాచి
తనవారి జంపుటది  తగదు తగదన్నాడు ॥

భగవంతుడు కృష్ణుడు  భామదె వహియించి
సారధిగ నిలిచేను సరి బోధ జేసేను
నాటి భగవద్గీత నేటికిల సుాక్తిగా 
జ్ఞాన మార్గము గుాపు జ్ఞాన నిధి యైనదిగ॥

ఆది భగవద్గీత  కర్జునుడు  కారకుడు . 
సార తత్త్వము దెల్పు  సామి శ్రీకృష్ణుడుా
గీత యొక్కటి చాలు గీర్వాణ ఫలమదే
వినుము ఈశ్వరి మాట  వివరమెరుగగ ఇలను॥
 
  





No comments:

Post a Comment