10/11/2021.
గోదావరీ తచయితల సంఘంలో
చిత్రకవిత
శీర్షిక : ఆగని ఆరంభం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
మానవ మేధో మధనం,
మంది , ప్రదుాషణం .
నిత్య జీవిత సారం ,
రోగాలకు నిలయం.
హరిత వర్ణం అరుణ
వర్ణంలోకి మారిన వైనం .
జాతి మత బేధాల
మారణ హోమాలకు సాక్ష్యం .॥
పచ్చని ప్రకృతి శోభలు
కమిలి నల్ల బారుతున్న సమయం.
ఆశా జ్యోతుల ప్రకాశంతో
అలరిన పసిడి కిరణాలు.
శుభోదయపు స్ఫుార్తి నిచ్చే
పసిడి భరణాలు.॥
మారని కాలానికి
మార్పులు తేవొద్దంటుా
మాయా జగతిలొ మానవుని
వికృతి చేష్టలకు విలపిస్తున్న
భుామాత కన్నీళ్ళను
కావలించుకుంటున్న సంద్రం-
ఇస్తున్న సలిల ఓదార్పుకు ,
సాక్షిగా నిలచిన హరిత
వర్ణపు ఆకుపచ్చ తివాచీ...
ఆశా జగతిలో ఆగని ఆరంభంలా....
No comments:
Post a Comment