Friday, November 19, 2021

మహతీ సాహితీ కవితలు

[11/16, 16:39] p3: 16/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
1.
ఘోరుడను ఋషిపుత్రుడు ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి కణ్వుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా  ప్రాశస్త్యము నొందెను॥
2.
వేద మంత్ర ద్రష్ట- రు  గ్వేదమంత్ర  పుాజ్యుగా
చతుర్వేదమందున   చర్చ కణ్వ ప్రార్ధన .
విశ్వమిత్రు జేరెను    విధి పుత్రి శకుంతల
కణ్వుాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥
3
గాడమైన యొాగము గాంధర్వ  వివాహము  
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసును శాపము 
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥ 
  4 .
 శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
 దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
 ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
 బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥ 
 5
యాత్ర జేయ కణ్వుడు  యాదవ పురమేగెను 
సరసమాడు యాదవులు  శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ  నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను   ముప్పుగనదె మారెను ॥
6
యాదవులు నశించెను  యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము  శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా  గనినట్టే చదివెను
జగదీశ్వరి మురిసెను  జగమునకెరిగించెను ॥.
[11/17, 18:43] p3: 17/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
ప్రక్రియ : కంద పద్యములు .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నారా యణనీ  నామము
నోరారగ  జపము జేతు నోముగ నెపుడున్
పారాయణ జేతు జనో-

ద్ధారా నను బ్రోవవేర  ధరశుభ చరణా ॥

శ్రీపతి నీవని వేడితి
ఆపదలను  బాపరావ ఆపద్బాంధా
పాపములను  శమియించవె
దీపము వలె వెలుగు జుాపు దీనోద్ధరణా ॥

నారాయణ నీ మంత్రము
పారాయణ జేయు వారు పావను లౌచున్
దారా సుతులను విడి,మన-
సారా నినుకొలి చెపాద సన్నిధి జేరన్ ॥
[11/18, 14:36] p3: మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
మ.సా.క.సం. : 19.
కవిత సంఖ్య  : 3.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥

హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥

హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥

నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము  శుద్ధమౌను మనసులు॥

వ్రతములు పుాజలకును  ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు  ఇచ్చును శుభ ఫలములు ॥

శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥

ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు 
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥

లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥

కార్తీకపురాణము కడు భక్తితొ  చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము  ॥

నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥ 

దివ్య కార్తీకముా  దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥

అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥

విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥

త్రిపురాసురులగుాల్చ  త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో     అసురులనిల గుాల్చెను ॥

అందరికానందము  హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥

ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥

ఈ ఇష్టపది , నా స్వీయ రచన.

No comments:

Post a Comment