[11/21, 08:35] +91 94405 30763: 20/11/2021.
పంచపది.
అంశము : కార్తీకమాసము.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
1.
కృత్తకా తారతో చంద్రుడు కాలుస్తాడు
బంగరు వెన్నెల సొగసులు కురిపిస్తాడు
కార్తీక పౌర్ణమికి దివ్యంగా వెలుగుతాడు
భవహరుని భక్తిభావంతో పూజింపుడు
ఆర్తితో అర్చనలు చేయండి జగదీశ్వరీ!
2.
హరి హరుల కిష్టము కార్తీక మాసము
ఇరువురుని పుాజింప జన్మ పావనము.
వేదఘోషలతో మారుమ్రోగె ఆకాశము
గనరే సురులు కొలుచు దివ్య పాదము
తొలిపొద్దు పొడిచె లేవరే జగదీశ్వరీ!
3.
ధార్మిక యొాచనల ధర్మ చింతనతోడ
ఉపవాస దీక్షల ఉత్తమౌ వ్రతముతోడ
ఏక భుక్తము జేసేటి ఏకాంతముతోడ
దీప దానము జేసి దివ్య ఫలముతోడ దీపాలు వెలిగించి వేడరే జగదీశ్వరీ!
[11/21, 18:42] p3: 21/11/2021.
పంచపది
అంశం: కార్తీకమాసము.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
4.
కార్తీక మాసములో భగవదారాధనలు
హరి హర పుత్రుడౌ అయ్యప్ప దీక్షలు .
సకల పాప హర శివాభిషేకాలు.
దేదీప్య మానమౌ ఆకాశ దీపాలు
కడు పుణ్య కార్యాల వ్రత దీక్షలీశ్వరీ..॥
5.
గ్రహ దోషములు పోవ నవగ్రహ పుాజలు
ఈతి బాధలు తొలగ ఈశ్వరార్చనలు.
అర్ధనారీశునకు బిల్వదళార్పణలు.
ప్రదోష కాలమున ప్రభు లింగ పుాజలు.
స్వర్గసీమల నేల వ్రతములివి ఈశ్వరీ ॥
6.
కార్తీక మాసాన హరియె దామొాదరుడు.
తులసీ మాలలు ప్రీతి గల విష్ణు దేముడు.
తులసి చెంతనె చేయ హరికి శుభ పుాజలు.
సుందరుడు శ్రీకరుడు ఇచ్చు శుభ ఫలములు.
మనసార హరిహరుల పుాజించు ఈశ్వరీ..॥
7.
కార్తీక మాసము కడు పుణ్య మాసము.
మంత్ర దీక్షలు గొన ఘన మైన మాసము .
నదుల లో స్నానాలు ఆచరించిన శుభము.
ఆయురారోగ్యాలు కలిగించు సత్యము.
గౌరి పుాజలు జేయ సౌభాగ్య మీశ్వరీ ॥
No comments:
Post a Comment