Monday, November 22, 2021

పుస్తక పఠనం.

22/11/2021.

(ఉమెన్ రైటర్స్  లో)
సాహితి బృందావన జాతీయ వేదిక,
ఉమెన్స్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో-
54వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కవితల పోటీ కొరకు రాసిన కవిత-

అంశం : పుస్తక విజ్ఞానం.

శీర్షిక  :  విజ్ఞాన ఖని .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..



ఒంటరితనంలో ఓదార్పునిచ్చే స్నేహం పుస్తకం.
లక్ష్య సాధనకు నమ్మిన ఆలంబన పుస్తక పఠనం.
సామాజిక సమస్యలపై అవగాహనకు మార్గదర్శి.  
సామాజిక స్పృహను కలిగించే సద్గురుబోధనం.॥

క్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గం పుస్తక పఠనం.
స్వీయవిశ్లేషణా సామర్థ్యాన్ని పెంచే అంతర్మధనం.
పదిమందిలో మాట్లాడగలిగే స్ఫుార్తికి నిదర్శనం .
చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుదలకు  -
దోహదపడే మంచి ఔషధాలయం పుస్తక పఠనం॥

భిన్నమైన ఆలోచనా ధృక్పథాన్ని కలిగించి ఆత్మ-
నిర్భరతను పెంచే అక్షర సోపానం పుస్తక పఠనం.
సృజనాత్మక జ్ఞానాన్ని పెంచే మహనీయుల 
బోధనా పటిమ పుస్తక పఠనం ॥

మెదడును వికసింపజేసే మంచి వ్యాయామశాల
పుస్తక పఠనం .
తడబడే  జీవిత గమనంలో  ఆత్మస్థైర్యాన్ని
పెంచి రాచబాటను చుాపించే అద్భుత దర్పణం
పుస్తక పఠనం ॥

జ్ఞానాధ్యయన సాధక యజ్ఞం ఫలం పుస్తక పఠనం. 
మానసిక ఉద్దీపనను తగ్గించి , జ్ఞాపకశక్తిని
పెంచే ఏకాగ్ర చిత్త సాధనా"గీత" పుస్తక పఠనం.
మరువలేని స్నేహ బంధం, పుస్తకంతో అనుబంధం॥.

అందమైన జీవితం కోసం హెల్తీ హాబిట్ బుక్ రీడింగ్.
కథలు, నవలలు చదవడం వల్ల సృజనాత్మకజ్ఞానం పెరుగుతుంది.



హామీ : 
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. 

No comments:

Post a Comment