పంచపది-37
అంశం : సుబ్రమణ్య షష్ఠి
కందూర్ చంద్రప్రకాష్ గుప్తా
మియాపూర్ హైదరాబాద్
చరవాణి 8008572446
షణ్ముఖుడు షట్చక్రాల సంకేత రూపము
షణ్మతాలలో నొకటిగ కుమారోపాసనము
ప్రకృతీ పురుషుల చిహ్నం కుమార తత్వము
సుబ్రహ్మణ్యతత్త్వం తెలిపిన ఇతిహాసము
మార్గశిరశుద్ధశష్టినే సుబ్రహ్మణ్యశష్టని తెలుప కందూర్
21
అగ్నిసంభవుడైన అవ్యక్తశక్తి పార్వతి సుతుడు
సురులకు సేనాపతి స్వామి సుబ్రహ్మణ్యుడు
పన్నెండు చేతులతో మాసాలు పన్నెండు
ఆరుముఖాలతో ఆరు ఋతువులకు జోడు
కార్తీక దీపారాధనలతో అగ్నిసంభవునకు పూజలు కందూర్
No comments:
Post a Comment