Friday, December 10, 2021

ఉగాది సంబరాలు

9/04/2021
"సాహితీ బృందావన వేదిక " వారి
"ఉమెన్స్ రైటర్స్"  సంస్థల ఆధ్వర్యంలో
"ప్లవనామ సంవత్సర ఉగాది "---
కవిసమ్మేళనం కొరకు:
అంశం: ఉగాది సంబరాలు

శీర్షిక  : ఆనందామృత వర్షిణి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

 

  నీరు లేక నీరస పడిన ప్రకృతిలో..
  నీరసించిపోయిన బీడుభుాముల్లో
  ఇంకిపోతున్న రైతు కన్నీటి కష్టం..
  కాష్టాల్లో బుాడిదై కరువు భాట వేస్తోంది
  కరోనా కలకలంతో వెలవెల బోయిన
  వాతావరణంలో కాలుష్యం కమ్మడంతో
  జన జీవనంలో ఉత్సాహం లోపించింది.
  కరోనా దాడికి కంపించిన కాలం
  కట్టుబాట్ల, కట్టడి సంకెళ్ళతో
  గృహ నిర్బంధమయ్యింది.
  విషయం గ్రహించిన ఉగాది కన్య  ఆలస్యం
  చేయకుండా నీటి వనరులు సమృద్ధినొసగే
  ప్లవ నామ " నెచ్చెలిని  ప్రేమతో తోడ్కొని
  పరిస్థితులను చక్కబెట్టేందుకు ...
  పరుగులతో వస్తోంది.  మంచి నీటితో
  నిండే పచ్చదనం, పంచే ప్రాణవాయువుతో
  సమృద్ధి నిండిన ఫల పుష్పాల పంట
  సారంతో అరోగ్యానందాల నవ్వుల్ని
  పంచడానికి. రండి !కొత్త వత్సర చెలికి
  అనందం తో మంగళ "స్వాగతం" పలుకుదాం.
---------------------------------------------------------
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితంకాని నా స్వీయ రచన.



9/04/2021
"సాహితీ బృందావన వేదిక " వారి
"ఉమెన్స్ రైటర్స్"  సంస్థల ఆధ్వర్యంలో
"ప్లవనామ సంవత్సర ఉగాది "---
కవిసమ్మేళనం కొరకు:
అంశం: ఉగాది సంబరాలు

శీర్షిక  : ఆనందామృత వర్షిణి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

 

  గత వత్సరపు గాయాలకు వైద్యం
  జరగకముందే,మాటేసిన మహమ్మారి
  రుాపుమార్చిమరో కోణంలో విజృంభించింది.
  హాహాకారాల అక్రందనలతో
  ఆనందాలకు దుారమైన జనం
  సంబరాల సందళ్ళకు స్వస్థి చెప్పేరు.
ఉత్సవ శోభలతో   ఉరుకు- పరుగుల
ఉత్సాహంతో వచ్చిన ఉగాదికన్య
ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వసంత కోయిల వలపు రాగాలతో
వేప పుా గంధాల మంద్ర పవనాలతో
మామిడి తోరణాల మంగళ గీతాలతో
ప్రతి వత్సరం ఆనంద స్వాగతం పలికే
నిండు కళల కాంతులు ఆరోజు కనపడడలేదు.
మానవ మేధస్సుకందని మహమ్మారి
చేసే మారణ హోమాన్ని ఆపాలనుకున్న
ఉగాది కన్య, షడృచుల అరోగ్యామృత 
భాండంతో సామాజిక దుారాన్ని పాటిస్తుా
సేనిటైజర్లు ,మాస్క్ లు నిండిన అరోగ్యకర
బహుమతులతో , విలువైన "వేక్సీన్"
ఆయుధాన్ని చేతబట్టి ప్లవ నామ
రుాప ధారణియై  మంగళాశనముల
మంత్రోచ్ఛారణతో మనమధ్యకు వస్తోంది
ఆనంద స్వాగతం పలుకుదాం రండి మరి.

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితంకాని నా స్వీయ రచన.


  

No comments:

Post a Comment