Friday, December 10, 2021

అందరుా బాగుండాలి

10/04/2021
C.Y. చింతామణి వాట్సప్ కు పంపినది.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : ఈ వత్సరమన్నా అందరుా బాగుండాలి..

రెండవ విడత "కరోనా" కలవరపెడుతోంది....
మనసు, మనిషి ఆరోగ్యంకోసం తపిస్తోంది. 
అభిరుచి సాహిత్యాన్వేషణ చేస్తోంది. కాలం...ఎవరికెవరుాకారంటోంది. 
దైవం ఇదంతా నా మాయ అంటున్నాడు.
జీవితం క్షణికమని తెలిసినా ఆశ 
బ్రతుకు పోరాటం భారంగా  చేస్తోంది.  
ఆశయాలు ఆలింగన చేసుకుంటున్నాయి. 
ఐనవారు ఆమడ దుారం నుండే పలకరిస్తుా
అత్మసంతృప్తి తో ఆనందిస్తున్నారు. 
మహా మేధావైన మనిషి మహమ్మారికి 
సరైన మందు కనుక్కోలేక మాయ 
రోగానికి బలహీనత తో బానిసౌతున్నాడు. 
ఇంత జరుగుతున్నా ఆగని స్వార్ధం 
శవాల వేలుముద్రలకు వేలం పాట పాడుతోంది. 
పదవి పాకులాట, ఓటు కు నోట్లు కురిపిస్తుా 
ఓదార్పు మాటల మార్పుతో మభ్య పెడుతోంది . 
అన్నీ అర్ధమౌతున్నా ,ఆగడాలకు 
అదురుతున్న ప్రజలు మౌనంగా మొాసపోతున్నారు
మారుతున్న వత్సరాలు మార్పును 
తెచ్చే పోరాటంలో అలసి- సొలసి 
పోయి  తిరిగి మళ్ళీ రావడం లేదు..
బ్రతుకు భారమా...నీకు "విముక్తి" ఎప్పుడు...?..

No comments:

Post a Comment