Friday, December 10, 2021

చిగురించిన వసంతం యుగాది

11/04/2021.
ఉ తె ర సం కుంభస్థంలో.....
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం
 వారి ఆధ్వర్యంలో ,
 ఉగాది కవితా సంకలనం కొరకు....

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక  : చిగురించిన వసంతం.

కరోనా రేపిన కల కలం తో
కలలు కల్లలౌతున్న సమయం.
గత వత్సరపు  కన్నీటి గాయాలకు
ఉపశమనం కలగక ముందే
మరో కోణంలో దుాసుకొచ్చిన 
మందులేని మహమ్మారి -
జీవితాలను గృహ నిర్బంధం చేస్తుా
మనిషి మనుగడకు సంకెళ్ళు వేసింది
పర్యావరణ రక్షణ లెేని ప్రకృతి గతికి
ముాగబోయిన  కోయిల మావి చిగురు
కానరాక  మౌన గీతి పాడుతోంది.
యుగాల నుండీ వత్సరానికో పేరుతో
షడృుచుల ఆరోగ్యామృతాన్ని పంచేందుకు 
వచ్చే ఉగాది కన్య , ఈ వత్సరం" ప్లవ "
నామ కన్యగా సమృద్ధినిచ్చే  నీటివనరులతో 
పచ్చదనాన్ని పెంచి , ప్రాణవాయువు
పంచేందుకు , పరిశభ్రత తెలిపే  
పాఠ్య పుస్తకాలతో పర్యావరణ రక్షణ 
చేసి, ,స్వచ్ఛ భారత నిర్మాణానికి 
పునాది వేసేందుకు పలు సాధనాలతో,
సంస్కృుతీ- సాంప్రదాయ పద్ధతుల 
సార పంచాంగంతో, కరోనా సంకెళ్ళను
 విడదీసి, గ్రహ బంధ ముక్తుల్ని చేసేందుకు
 పరుగు పరుగున  మనకోసం వస్తోంది 
ఆమెకు. "ఆనంద స్వాగతం " పలుకుదాం రండి. 
----------------------------------------------------

No comments:

Post a Comment