Tuesday, December 21, 2021

గణాడ్యుడు...బ్రహత్కథలు

*విఠల పంచపది కవనములు*
*గుణాఢ్యుడు-బృహత్కథలు*

అసామాన్య గుణనిధి సద్గురువు గుణాఢ్యుడు
బృహత్కథను రచియించిన మహా కథకుడు
ప్రాకృత భాషా విద్యాంశుడు మార్గదర్శకుడు
సంస్కృత కావ్యకథా రచయిత శ్లాఘనీయుడు
దండి భట్ట బాణులచే గౌరవించబడె విఠల!

భాసకవికి సాహితీ మార్గనిర్దేశిగా నిలిచాడు
క్షేమేంద్రుకి కావ్యాయానుశీలుడిగా నిలిచాడు
సోమదేవభట్టు కథలకు పునాది అయ్యాడు
బుధస్వామి కథాసంగ్రహముకు ప్రేరేపకుడు
బృహత్కథలకు ఆద్యుడు గుణాఢ్యుడు విఠల!

గుణాఢ్యుని కథలన్నీ వర్ణనాతీతములు
ఇవి పొందెను కీర్తిప్రతిష్ట ప్రాశస్త్యములు
అనుసరించిరి పలువురు కవి కథకులు
జగతిన ఖ్యాతిగాంచెను బృహత్కథలు
బహుభాషలలో అనువదించబడె విఠల!

దక్షిణ భారథపు పైశాచి భాషలో రచించెను
సాహితీ క్షేత్రంలో బహుళ ఆదరణ పొందెను
21000 శ్లోకాలుగా అనువాదించాబడెను
నరవాహనదత్తుని సాహసాలను వర్ణించెను
వేదం వెంకతరాయశాస్త్రి తెనుగించె విఠల!

బృహత్కథలన్ని అరేబియన్ కథలుగా
ఆ తదుపరి అవి పంచతంత్ర కథలుగా
పిదప భేతాళ పంచ వింశతి కథలుగా
అవే తరువాత హితోపాదేశపుకథలుగా
రూపాంతరం చెంది ఖ్యాతిగాంచె విఠల!

No comments:

Post a Comment