మహతీ సాహితీ కవిసంగమం
తేదీ:--22--12--2021
అంశము:--గణితము, శ్రీనివాస్ రామానుజం
ప్రక్రియ:-- పద్యం
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 3.
ఛందస్సు:--ఆటవెలది.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
భార తీయ గణిత శాస్త్రవే త్తయతడు
గణిత ప్రియుడు గట్టి పట్టు పట్టె
కోరి స్వయము జేసె కొత్తసి ద్ధాంతాల
గణిత ములను కృషిని ఘనము గాను ॥
అతడె రామ నుజుడు ఆధునిక ఫలితాల
గణిత శాస్త్ర మునదె ఘనము జేసె.
భిన్న మైన గణిత భిన్నత్వ మేకృషిగ
జగతి ఖ్యాతి నొంది జేల నందె ॥
No comments:
Post a Comment