1 నుండి 30 వరకు పుార్తి పాశురములు తెలుగులో...ప్రక్రియ :"ఆటవెలది"లో..
1. పాశురము.
** **********
చెలియ లార రారె చేయంగ వ్రతమును
మేలు కొల్పు లిడుచు మేలు పుాజ
రమణు లార పాడి రమ్యమౌ గీతములు
విధిగ పాడి నుతుల విభుని కొలువ ॥
శేష శయను డతడశేష మహిమ లేలు
సిరి కిపతి యతడు శ్రీకరుండు
వైభ వమ్ము లేలు వైకుంఠ నాధుండు
రక్ష మనకు నిడెడు రంగ విభుడు ॥
సర్గ ద్వారములవె సరి తెరచి యుండు
మార్గ శీర్ష మందు మహిమ యదియె
దుర్గమౌ నఘములు దుారమౌ దురితాలు
దీర్ఘ యశము లిచ్చు దివ్య వ్రతము ॥
2.వ పాశురము.
***************
పాల సంద్ర మునదె ఫణిశేష తల్పాన
పద్మ నాభు డతడె పవ్వ ళించె
మేలు కొల్పు లిడుచు మేటి కీర్తుల వేడి
శ్రీశు పదము లిడక శరణ మనరె ॥
కురుల పుాలిడ కండి కులుకు బోణులాల
పరుల బాధ బెట్టు పలుకు లొద్దు
సత్య భాష ణమ్ము సరిదాన ధర్మమ్ము
సత్య వ్రతము జేయ సరినియ మముసుండి ॥
గురులు జ్ఞాన ధనుల గుాడి సేవలుజేసి
ఐకమత్య మెరిగి హరిని గొలచి
దీక్ష తోడాె౫తయత వ్రతము దివ్యమ్ము గనుజేయ
మార్గ శీర్ష మిదియె మంచి దండీ ॥
3.వ పాశురము.
**************
మూడు లోక ములను ముప్పాద ములగొల్చి
బలిమి బలిని అణచు బాలు డతడు
విష్ణుర రుాపు డతడు వినరారె సఖులార
వటువు వామ నుండు వాని కొలువు ॥
కోడి కుాసె నుచెలి కొలువంగ రంగనీ
తెమిలి తాన మాడ తెరలి రండే
నెలకు ముాడు తడవలు నేలవ ర్షములుండు
పసిడి పంటల సిరి, పాడి నిండు ॥
నిత్య ముగను భువిని నీరములే కురియగా
జారు గిరుల ఝరులె జలజ నయని
నదిని మీన ములవె నడుమనా ట్యములేలు
నదుల కలువ లెన్నొ నతిగ విరియు ॥
4.పాశురము.
విష్ణు రూపు డతడు వివిధ నామాలతో
వేగ వచ్చె తానె వెతలు దీర్చ
మెరయు మేని పోలు మెరపులే మెరయంగ
వర్ష ధారలు కురిసె వరుస భువిని ॥
నాద శంఖ మొాలె నానింగి గర్జించె
రామ శరము వోలె రాలె చినుకు
నమ్మి రండె చెలులు నదితాన ములనాడ
రంగ పుాజ లవియె రక్ష సుండీ ॥
5.పాశురము.
************
మధు రపురి నేలు మధుర మంగళ ముార్తి.
ఆయ శోద సుతుడు అతడు సుమ్మి
నల్ల నైన వాడు నరునిరుా పములోన
అవని నేలు ఘనుడు ఆది విష్ణు ॥
వేద వంద్యు డతని వేడుకొ నగరారె
పట్టు వస్త్రము లిడి పలుక మనుచు
పాద పుాజ లిడరె పరమేశు డతడేగ
పాప ములను దృంచు పతియు నతడె ॥
6.పాశురము
*************
గరుడ వాహ నుడదె ఘనఆల యమ్మున
సుర శంఖ నాద సుఖము లేలె
పుాత నసురి జంపి పుణ్యభుా మినిగాచు
మొాక్ష మిచ్చు విభుడు మొాహ నుండు ॥
యొాగ నిద్ర నేలు యొాగిహృన్నిలయుడు
దాస పోష కుండు దాన వారి.
మేలు కొల్పు లిడగ మేల్గాంచు వరదుండు
యశము లిఛ్చి బ్రోచు హరిఘ నుండు ॥
పద్మ నాభు డతడు పరమేశ్వ రుడుహరి
శంఖ చక్ర ములిడు శాంత ముార్తి
పరమ పావ నుండు పరనిచ్చి పాలించు
పట్టి పదము లతని పాహి యనరె ॥
7.పాశురము.ఆమ ధుర రవము
************
పక్షి రవములు వినవె పాడెనాలాపనలు
మేలు కొల్పు లవియె మెరుపు బోడి
వెన్న పాల దొంగ వేంచేయు వేళాయె
కేశి నిదుని మేటి కేశ వుండు ॥
విద్య లెరిగి మీరు విజ్ఞత లెరుగరా
వంద్య మాను కొలువ వడిగ రారే
తాత్సా రమ్ము మీకు తగదుత గదులేమ్మ
తడయు టలవె మాని తరలి రమ్ముభా ॥
నలము IIII నగము IIIU
సలము IIUI భగణము UII
రగణము UIU తగణము UUI
8.వ కీర్తన .
*********
ఉదయ భాను డదిగొ ఉదయించె నభమున
పొన్న పుాల వన్నె పోలు కాంతి
మేలు కొనిప శువులు మేతకై పరుగిడె
మేలి మువ్వ లసడితొ మేచ కాంగి ॥
చక్క నైన చెలియ చన్నీటి స్నానాలు
చేసి హరిని కొలువ చేర రావె
కీర్తి నేలె డుహరి, కీర్తింప పరనిచ్చి
సేవ జేయ మురిసి సేద దీర్చు ॥
9.వ పాశురము.
*************
రత్నా లుపొది గేటి రతనాల మేడలో
దీప కాంతు లసిరి దివ్య ప్రభలు
సాంబ్రా ణిపొగ నిండు సారగం ధముజిమ్మ
మత్తు వీడచి తరుణి మమ్ము జేరు ॥
ఏలి కైన వాని ఎలుగెత్తి పిలచేము
ఏల వినవు నీవు ఏమి నటన..
నిదుర మాని నిువు నిత్యపుాజ లవిజెేయ
సఖుల గుాడి రామ్మ సార సాక్షి ॥
అత్త కుాతు రివిగ అందాల నాచెలీ
చిత్త చోరు నిగన చిరున గవున
పరమ పదము నేలు పన్నగ శయనుని
పాద సేవ జేయ పదవె కదలి ॥
10.వ పాశురము .
****************
ఇంత విన్న కుాడ ఇంతిప లుకవేమ్మ
నోము నోచి తివిగ నోర్మి నీవు
కుంభ కర్ణు నివలె కులుకు నిదురేల
కలికి కనులు తెరువు కంబు కంఠి ॥
ఇచ్ఛ తులసి మాల నింపుగా ధరియించి
సొంపు నేలె నిలను శోభ నుండు
పుణ్య పురుషు డతడు పురుషార్ధ ములనిచ్చు
శంఖ చక్ర ధరుని శరణు కోర ॥
బంధు జనుల గుాడి భవుని కొలువంగ
పోవు చుంటి మనుచు, పోరి పిలువ
వాలు కనుల దోయి వంపున డుముదాన
కోమ లాంగి రావె కొలువ హరిని ॥
11.వ పాశురము.
***************
నంద నంద నునదె నావేద వంద్యుని
కనగ రావే మమ్మ కలికి కొమ్మ
గొల్ల పట్టి విగదా గోవిందు కొలువగా
నెమలి నడక దాన నెలత రమ్మ ॥
పుణ్య వతిగ నీకు పురము నదెపేరు.
అలసి తిమిగ పిలచి ఆట కాదు
పెక్కు రీతు లేల పెద్దింటి పడతివీ
పరమ పావ నునదె పాడి వేడ ॥
తిరు నామ మహిమ తిరువైభ వముపాడి
శ్రీశు కృష్ణు కొలిచి శ్రీలు బడయ
నమ్మి కొలువ రాగ నటనని ద్దురలేల..?
పరము లిచ్చు వాని పదము కొలువ ॥
12వ పాశురము
*************
లేగ దుాడ లవియె లేచిపొ దుగుచేర
పొదుగు నిండు ప్రేమ పొంగి పొరలె
పాడి ఏరు లాయె పాలు నిండెనుపల్లె
వాదు లాట లేల వనజ నేత్రి॥
రావ ణాంత కుండు రామచందృని వేడు
నామ జపము కన్న నమ్మి కేది..
మత్తు నిదుర మాని మావెంట రావమ్మ.
మాధ వునదె వేడి మరలి పొమ్మ ॥
రారె సఖియ లార రంగని కొలువంగ
పరమ పురుషు డతడు పావ నుండు
మార్గ శీర్ష మందు మంచి తానము లాడి
ముదము భక్తి కొలువ ముక్తి నిచ్చు ॥
13. వపాశురము.
****************
పక్షి రుాపి బకుని పట్టి ఛెండాడేను
రావ ణాసు రునదె రణము నందు
జగదే కపతి యతడు జగదభి రాముని
కీర్త నలకొ లువగ కినుక వలదు ॥
శుభము పలుక మనకు శుకృడే ఉదయించె
పక్షి కుాత లిడుచు పలికె పాట
ఆభయ హస్తు నిగన ఆలసింపక రామ్మ
సమయ ముమరు వవుగ సుంద రాంగీ ॥
తేనె తాగి మత్తు తేలుతు మ్మెదవంటి
కన్ను లున్న కలికి కనులు తెరువు
చాలు సాకు లిడుట చాలించు విరతి
తాన మాడ మత్తు తరలి పోవు ॥
14. వపాశురము.
**************
మమ్ము లేపె దనని మాటిచ్చి మరచేవు.
నమ్మ మమ్మ నిన్ను నళిన నేత్రి.
సీమ నేలు సిరివి సిగ్గులే దటెనీకు
శమము దీరి రావె సమయ మునకు ॥
మునులు వేద విదులు ముందేవిచ్చేసేరు .
దేవ ళముల జేరె దేవు దరికి .
ధవళ ధంత ద్యుతుల ధరణి ధవుని
కన్ను లార కనగ కదలి రావె ॥
15. వ పాశురము.
మునుపు తెలియ లేదు ముద్దు మాటలు నీదు
ఓర్మి వేచితి మిక నోప లేము .
కమ్ము నిద్దుర విడి కదలిరా కలకంఠి.
గోష్టి కలియ రావె గోప కాంత ॥
గోప కాంత లార గోవిందు కలియంగ
తెల్ల వార మున్నె తెమిలి వత్తు .
విదిత మాయె తప్పు విసుగింక మానరో
జాప్య మింక లేదు జాణ లార ॥
దుష్ట సురుల కంసు దునిమినట్టి ఘనుడు
నంద గోప ప్రియుడు నంద సుతుడు
గొల్ల భామ లసరి కొల్లలా డెడువాని
మాయ జేయు వాని మదిని కొలతు ॥
*********************************
16. వ పాశురము.
**************
రేడు వనుచు మురియు రేపల్లె కన్నెలుా
పర నిత్తు వనుచు పరవసించి
తెమిలి వచ్చి నారు తెరుమయ్య తలుపులు
నీదు వాకి టనదె నిలచి నారు ॥
విస్మయంపు పనుల విజ్ఞతెరుగు వాని .
మేల్కొలుపగ వస్థి మేము నుతుల
వన్నె కాని లేపి వలపు మాటలుజెప్పి
తలుపు తెరువ మనవె తరుణి మంగ ॥
నీల వర్ణ ముగల నీలమే ఘుడు రంగ
హేమ మంది రమున హేల చాలు
లీల చుాప రావ లీలామానుష వేష
నిత్యపుాజ లందు నీరజాక్ష ॥
17.వ పాశురము.
***************
అక్క సమున పిలచి అన్నపా నములిచ్చు
చక్కనైన సామి చంద్ర ముఖుడు
మలయు నుతుల పాడ ముందుగా వచ్చేము
నిర్గ మించు రంగ నిర్మ లాంగ ॥
అతులి తబల ముగల అన్నవు బలరామ
పట్టు పుట్ట మిడెద పలుక రావ
మహితు డౌఅ నుజుని మన్నించి గొనిరావె
మాదు కోర్కె మరచె మాధ వుండు ॥
విష్ణు నీమ హిమలు వివరింప లేనయా
పసరె నీదు ఖ్యాతి పదుమ నాభ .
చెలియ లార రండె చేరికొ లువగను
రంగ నాధు డతడె రమణు లార ॥
18.వ పాశురము.
****************
విరతి నేలు వాని విడుమసా గరపుత్రి
అలవ టమ్ము నొదలి ఆదు కోమ్మ
వేద విదుని హరిని వేడుకొనెదమమ్మ
వేగ తెరువు తలుపు వేద గాత్రి ॥
పరమ పావను పద పంకజ ములవీడి
తడయు టికవ లదని తరచి జెప్పి
నగవు మొాము తోడ నాధుని పంపమ్మ
కురుల కమలి కీవు కలుకు కొమ్మ ॥
కోడి కుాసె నదివొ కోయిలమ్మలు కుాసె
మల్లె జాజు లువిడె మధుర ముగను
లలిత కోమల కలికి లలిత రాగపు కంఠి
కలల రేని లేపి కదలి రమ్మ ॥
19. వ పాశురము
****************
మణి రత్న ములవె మంచిగా పొదిగున్న
పంచ గుణపు మేటి పరుపు పైన
నీళ వక్షమునదె నిదురించు మాసామి
తలిరు బోడిని విడి తరలి రావ ॥
విమలయశుని వీడి విరతి చాలించవే
నాధు విడువ నిదుర నటన లేల..?
మరుగు సదనము విడి మాటాడ నీయవే ॥
వరుస వెన్నునెడల వలపు చాలు ॥
20. వ పాశురము.
***************
భక్తి తోడ కొలువ భయముబా పెడుదేవ
శక్య మౌన నీదు శక్తి తెలియ
అక్కసమ్ము తోడ ఆదుకో మమ్మీవు
నీళను విడుమింక నీరజాక్ష ॥
ఎర్రనీ పెదవుల ఏపు గుబ్బల దాన
సన్ననీ కటిగల సతి నీళ
నీదు నాధు విడము నీరాడ నళినాక్షీ
అలరు సింగా రముల -కద్ద మిడుము ॥
ముాడు లోకములకు ముాలమైన విభుని
కోటి దేవ తలదె కొలచు వాని
కోరి నట్టి కోర్కె కొలువంగ తీరును
మార్గ శీర్ష మాస మహిమ ఘనము ॥
*******************************
21.వ.పాశురము.
****************
గోవుల నదె కాయు గోపాల బాలుడా
నంద గోప బాల నటన చాలు
శీల సద్గుణ ధన శ్రీకృష్ణ లేవయ్య
జాలమేల నయ్య జాగుసేయ ॥
ఆశ్ర యించి నాము ఆదుకొనగరావె
విరతి చాలు చాలు విశ్వ వంద్య
నీదు వాకిట నదె నిలచియుం టిమిసామి.
మంగళములు పాడ మాధవ ఘన ॥
చెలుల తోడ్కొ నుచును తెమిలి వచ్చేమయ్య
తొలి పొద్దు పొడిచె తొందరించు.
మార్గ శీర్ష వ్రతము మనసుతో జేయంగ
మేలు కొలుపు లిడుచు మేలు రీతి ॥
22. వ పాశురము.
****************
రణము నందు వీర రాజాధి రాజులుా
పణము నొడ్డి పోరి రణము నోడి
దర్ప మునదె వీడి దాసులై నినుజేరు
నట్టి నిన్ను మేము నమ్మి నాము ॥
నామ కీర్తి పలుక నాధుమా తరమా
డెప్ప రములు అవియె జెప్ప మాకు
భక్తి తోడ నిన్ను భజన చేయగ వచ్చి
నిన్ను జుాడ నిచట నిలచి నాము ॥
సుార్య చంద్రు లంటి శుభనయనునకునుా
శంఖ చక్ర ముగల శక్తి ధరుకు
పుష్ప హారము లేయ పులకరిం చునుమేని
పావ నుండ తండు పాప హారి ॥
23.వ పాశురము.
****************
వర్ష ఋతువు నందు వర్షించు మేఘాల
సవ్వ డులకు లేచి సంద డించి
భీక రాకృ తినిడి భీషణఘ ర్జనజేయు
కదన సింహ మొాలె కదలి రమ్ము ॥
నిర్గమించు మయ్య నీలమే ఘశ్యామ
పాదు కొన్న వేల్ప పరమ పురుష.
మంది రమ్ము వీడి మమ్ముబ్రోవగదయ్య
శ్రీశ రంగ నాధ సిరిపురీశ ॥
విరియు తామర వలె విచ్చు కనుల తోడ
నిచ్ఛ మమ్ము గావు నీరజాక్ష..
విజయ పీఠ మెక్కి వినువిన్న పాలనుా
సామి సన్ను తింప సమ్మ తీయు ॥
24.వ పాశురము.
***************
ముాడ డుగుల తోడ ముల్లోక ములగొల్చ
మలయు పాదములకు మంగళమ్ము .
మహినసురుల గుాల్చి మడియించు శక్తికీ
మంగ ళమ్ము లివియె మాధ వునకు ॥
పుాత నాదు గుాల్చి పురము గాచిన వాని
గోగొ ,పాలు నేలు గొల్ల వాని
గోటి తోడ నుగిరి గోవర్ధ నమునెత్తు
గోపి కృష్ణు నెపుడు గొల్తు మేము ॥
వేద విదుని చేతి వేలాయుధమునకు
మహిత సద్గుణ శీలు మాధ వునకు.
పరను యిచ్చు వాని పరమాత్మ కృష్ణకుా ..
జగద ధీశు నకును జయము జయము ॥
25. వ పాశురము.
***************
దేవ కీసు పుత్ర దేవదేవుడ వీవు
రెప్ప పాటు నదిని రేయి దాటి
నందు నింట జేరి నమ్మువారిని గాచి
కంసు జంపి నట్టి ఘనుడవీవు ॥
సిరుల లక్ష్మిని హృది స్థిరముగా నిలిపేవు
వరము గాను కలిమి ధరను పంచి
పుణ్య పురుష మాకు పురుషార్ధ ములనిచ్చి
అండ నుండ మాకు ఆప దేల ॥
వరలు భక్తి తోడ వచ్చి కీర్తులుపాడు
నామ జపమె మాకు రామ రక్ష .
వంద్య మమ్ము గావ వదలు విరతి నింక
మహిత మాయె మీదు మహిమ,యశము ॥
26 .వ కీర్తన.
************
పుార్వి కులదె నోచు పుాతమైనవ్రతము
మాస మార్గ శిరపు మహిమ నెంచి
సఖులు తతిగ గుాడి సంకల్ప సిధ్ధితో
తాన మాడి వచ్చె తమను కొలువ ॥
పాంచ జన్య మట్టి పాల సంద్రముపైన
పవ్వ ళించు సామి పలుక వయ్య ॥
వలయు సాధన లిడి వర్ణింప నినుజేరి
శంఖ నాద ములిడె శాస్త్ర ముగను ॥
మేటి దివ్వెల గొని మేలుకట్లనమర్చి
మంగ ళముల పాడె మహిత ముగను
తప్పు లెరుగ మయ్య తల్లితండ్రివి నీవె
మన్ని కమము గనుమ మార జనక ॥
27. వ పాశురము.
****************
కల్యాణ గుణ రామ కామితార్ధసుధామ
పుణ్య లీలలు విని పులక రించి
పట్టు వస్త్ర ములిడ పరమాత్మ వచ్చేము
కట్టు కొనుము శ్రీశ కరుణ నేల ॥
గోఘృ తపరి మళపు గోరు క్షీరాన్నముా
పసిడి గిన్నె లోన పంచి నాము
విమల యశుని హరిని విధిగచే కొనిరమ్మ
తడయుటలిక మాని తరలి రండు ॥
28 .వ పాశురము.
*************:**:
గోవు లెనుము లేలు గొల్లవారము మేము.
మడువుటలు తెలియని మంద మతులము
అలరు జ్ఞాన మునిడ అవతరించినదేవ
పుణ్య ఫలము మాదు పుణ్య ముార్తీ ॥
లోక నాధు డవుగ లోపముల సవరించ
మాలో నొకడి వైయు మసలి నావు ॥
మాస ఖుడవు నీవు మిమ్మునమ్మితిమయ్య
ఆగ్ర హింప కయ్య ఆది దేవ ॥
సఖుడ వీవ నెంచి సరిమా టలుమీర
మన్న నలిడు మయ్య మమ్ము గావ .
తప్పు లెరుగ మయ్య తరలిరా క్రిష్ణయ్య
నీదు లీల చాలు నిదుర లెమ్ము ॥
29.వ పాశురము.
***************
అరుణ కాంతి విరియ అతులితో త్సాహాన
నీదు సేవ జేయ నిలచి నాము
పరము లార్ధ ములను ఫలము లాసింపముా
( ఫలము లాశ లేదు పరమార్ధ మాసించ)
అంత రంగ సేవ కనుమ తీయు ॥
పట్టె డన్నము తిని పశువులన్ మేపేటి
గొల్ల వంశ మందు గొంటి జన్మ
జన్మ జన్మ బంధు జనులముా మేమంత
నిన్ను వీడ లేము నిజము క్రిష్ణ ॥
నీదు మంది రమున నీసేవజేయంగ
మాస మార్గ శిరము మంచి దనుచు
చలిని స్నాన ములిడి చక్కదీక్షను పుాని
నిన్ను కొలువ వస్థి నిదుర విడుము ॥
30.వ పాశురము.
***************
నిదుర లింక చాలు నీలమేఘశ్యామ
మధుర మంగళ రవ మదియె వినుమ
మేలుకొలుపులు విని మేలుకో వేమయ్య
శ్రీశ తలుపు తెరుమ శ్రిీని కేత॥
పాల సంద్ర పుసిరి పడతిలక్ష్మినిబట్టి
వేల నామ ములతొ వెలయు సామి
గోవు,గోప, బాల, గోపీజన లోలా
నీదు లీల జుాపు నీళ నాధ ॥
విష్ణు చిత్తు పుత్రి విమలయశసుగాత్రి
పరమ భక్తి పాడె పాశు రములు.
సార్ధ కమ్ము లాయె సారమౌ కీర్తులు
అట్టి భాగ్య మిమ్మ ఆర్క తేజ ॥
****************************
జయము గల్గ జేయు జగదీశ్వ రికినీవు
పాడె భక్తి తోడ పాశు రములు
తెలుగు లోన రాయ తెనిగించెచుాడయా
తప్పు లెంచ కయ్య తలచి భక్తి ॥
మంచి చెడుల జ్ఞాన మన్నదే లేదయా
వేద పుాజ లేవి వెరసి రావు.
కోర్కె నీదు భక్తి కోరెనీశ్వరిలను
ఈప్సి తమ్ము లిడుచు ఇమ్మ ముక్తి.
****************************
=====ఓం..తత్సత్ ...========
No comments:
Post a Comment