తత్త్వ బోధ కీర్తన .
శివ శివా శివ శివా శివ శివ శివ యనరా
హర హారా హర హారా హర హారహర యనరా
శివ శివ యని అనగా శమియించును పాపములు
హరి నామము తలచినంత అందునులే అభయములు ॥
ముాడు లోకాలవే ముక్కంటిలో లయము
లోకుల కర్మల ఫలముకు కర్త ఆ శ్రీహరీ
ఆ సుాత్ర ధారులా తోలు బొమ్మ లాటలో
బొమ్మలముా మనముా ఆడేము మనుముా ॥
సృష్టి కర్త బ్రహ్మకుాడ మార్చలేని రాతలు- వి
ధాత రాయు రాతలే విశ్వమందు చరితలు..
బుద్ధి జ్ఞాన కర్మలుా ఘనమౌ యొాగంబులు- ఆ
తత్త్వ మెరిగి మసలుటలే జన్మ మొాక్ష ఫలములు ॥
తత్త్వ మెరుగు బుద్ధి జీవి తనకు తానె మిత్రుడు
జ్ఞాని గాని నరుడు తనకు తానె శతృవు.
పాప కర్మునాత్మ తిరిగి జన్మనొందు తథ్యము
పుణ్యాత్ముల ఆత్మ జేరు తుదికి వైకుంఠము ॥
తెలిసీ తెలిక జేసిన పాపము శిక్షార్హము.
ధర్మ బాట నడవు మదే ముక్తికి సోపానము .
జీవులంత ఒక్కటన్న భావమదే సత్యము
జీవాత్మయె పరమాత్మగ తలచ నదే తత్త్వము ॥
శివ శివ శివ శివ శివ శివ శివ శివ యనరాదా
ఆ శివ తత్త్వ ము నెరిగీ ఇలలో మనరాదా..
హర హర హర హర హర హర హర హరాయనీ అనరా
ఆది నారాయణుని ఆత్మ నందె తలవరా ॥
No comments:
Post a Comment