[1/10, 18:45] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*
తేది: *10-01-2022: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం*
వచన కవిత.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 1.
రచన :
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
ఆకాశానికి నిచ్చనలేసే మనిషి మేధస్సు.
నక్షతాలను తాకుతుా పలికే నవోదయ భావ కవనాలు.
ఇంద్ర ధనుసు ఊయలలో వాలి ఊహలలో తేలుతుా,
వాస్తవాన్ని మరచిన మానవుడు మహనీయుడు.॥
పచ్చదనాన్ని కాలరాసి కట్టే భవనాల లో
పట్టు పరుపులపై నిద్రపోతుా నిజాన్ని మరచిన మానవుడు మహిలో మంచి బాటకు సమాధి కట్టేడు.
పర్యావరణ రక్షణ చేయక పెంచుతున్న
ప్రదుాషణంతో పేరుకు పోతున్న కుప్పల్లో
పెరుగుతున్న విషకణాలను అంతం చేయలేక
మాస్క్ సేనిటైజర్ల వాడుకకే పరిమితమై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాడు.॥
.
మందులేని మహమ్మారులను పెంచి పోషిస్తుా కుాడా
రాజకీయ వైఫల్యమే కారణమని, తమకు తాముగా
చేసుకుంటున్న బుద్ధిలేని బుాజుపట్టిన సద్దుబాటుతో
నోట్లకు ఓట్లనమ్ముకుంటున్న తెలివైన మహనీయుడు .
పంట పొలాలు బీడు భుాములుగా మారుతుాంటే
బ్రతుకు దారి లేని రైతన్నల ఆత్మహత్యలను
అసమర్ధతగా పరిగణిస్తుా..ఆకాశంలో జీవితాన్ని
పండించుకొనేందుకు ఆశల నిచ్చెనలు వేస్తున్నాడు.॥
ప్రకృతి పరంగా ఎన్నో వసతులను సమకుారుస్తున్న భుామాత ఋణం-తీర్చలేని విశ్వాస ఘాతకులు
మరో ప్రపంచ సృష్టికై ఆకాశ పునాదులు తవ్వుతున్నారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్టు...॥
మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి ,
మట్టిలో పండిన కుాడు తిని, మట్టిలో
కలిసిపోతామన్న నిజమెరిగిన మనిషి ,
మట్టి విలువను మరచి , తమ మేధస్సును
విశ్వ విధ్వంశ రీతిలో విలువలేని పనులకు వినియొాగిస్తున్నాడు ॥
అమ్మ భారతిని ఆదరించలేని అవ్యర్ధులు
అడుగే నిలవని. అంతరిక్షంలోకి అడుగు పెడుతుా ,
విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తుా ....
తమ తెలివికి తామే మురిసిపోతున్నారు .॥
************************************::
[1/10, 19:57] +91 94418 71767:
మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి ,
మట్టిలో పండిన కుాడు తిని, మట్టిలో
కలిసిపోతామన్న నిజమెరిగిన మనిషి ,
మట్టి విలువను మరచి , తమ మేధస్సును
విశ్వ విధ్వంశ రీతిలో విలువలేని పనులకు వినియొాగిస్తున్నాడు ॥
అమ్మ భారతిని ఆదరించలేని అవ్యర్ధులు
అడుగే నిలవని. అంతరిక్షంలోకి అడుగు పెడుతుా ,
విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తుా ....
తమ తెలివికి తామే మురిసిపోతున్నారు .॥
చాలా అద్భుతంగా వుంది మేడం తమరి కవిత🙏🙏🙏
No comments:
Post a Comment