Monday, January 10, 2022

జీవన సంక్రమణం

మనుమసిద్ధి కవన వేదికలో
అంశం : జీవన సంక్రమణం.

మనిషి జీవితం  ఎన్నో  ఆటు పోట్ల వలయం.
మారుతున్న మనస్తత్త్వాల మారణ హోమాల సంక్రమణం ॥
మారుతున్న కాలం తో  మారుతున్న  వ్యవస్థ.
మనిషి  లో మనిషి చేసే స్వార్ధ చింతనల అవస్థ.

రాజకీయపు టెత్తులకు మారుతున్న మనిషి గమనం.
మంచి చెడుల తేడాల్లేని వ్యవహార సంక్రమణం. 
పచ్చదనం కరువైన ఫలితంగా పెరిగే ప్రదుాషణం .
అవలీలగా వ్యాపిస్తున్న కణవ్యాధుల సంక్రమణం.॥

సంస్కృతి సాంప్రదాయాలకు దుారమౌతున్న జనం.
వ్యామొాహ మార్పుతో వచ్చిన పాశ్చాత్య సంక్రమణం.
అంతరాలు మరచిన ఆవేశాలతో అడ్డ దారుల్లో జనం. 
మాదక ద్రవ్యాల మత్తు నిండిన రోగాల సంక్రమణం ॥

సామాజిక దుారాలు పాటించాలిక నిరంతరం.
మర్చిపోయి వ్యవహరిస్తే  కాటేసే కణం భయం 
ఒంటరి పోరాటంతో మిగిలే ఓదార్పులేని గాయం.
ఒకరినుంచి మరొకరికి పాకే భయంకర  సంక్రమణం.॥


మనవైన పండగలను ఆచరించలేని  అస్తవ్యస్త జీవితం.
కొత్త మాస్క్ లు సేనిటైజర్ల  కొనుగోళ్లతో  ప్రారంభం ॥
ఇకనైనా మేలుకొని మారాలి మనమందరం .
మన ఆచార వ్యవహారాలే మనకున్న మంచి బలం ॥

మారుతున్న మనస్తత్వాలతో  మసలే జనం.
మర్చిపోతున్న సాంప్రదాయాలను వెలికి తీసే దినం.
ప్రతీ ఏటా వచ్చే భోగీ,  సంక్రాంతుల ఆనంద సంబరం.
పండగ పేరుతో మన ముందుకు వచ్చే మనదైన మేలైన సంక్రమణం ॥   



No comments:

Post a Comment