Tuesday, January 11, 2022

మార్కండేయుడు

అంశం : మార్కండేయ మహర్షి .
రచన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .


మృకండుడు, మరుద్వతి అనే ఋషి దంపతులు -సంతానం కోసం  వారణాసిలో చేసిన తపస్సు ఫలితం.
మహా శివుని వర ప్రసాదంగా మార్కండేయుని జననం .
 అల్పాయుష్కుడైన పుతృని బడసిన విచారం.
 ఋషి దంపతులకు సంతోషం కరువైన జీవిత శాపం.
 మార్కండేయుడు సప్త ఋషులకు చేసిన పాదాభివందన ఫలితం 
" చిరంజీవి"అని దీవించిన సప్త ఋషుల దీవెన వైనం.
16 వత్సరాల ఆయువు మాత్రమే  తమ పుతృునికి
ఉన్నదని కన్నీటితో కుమారుని జన్మ రహస్యం మునులకు  తెలియజేసిన మృకండుడు.
దివ్య దృష్టి తో అంతా తెలిసిన సప్తర్షుల కారణంగా ..
బ్రహ్మ దేవునిచే చిరంజీవిగా దీవింపబడ్డ మార్కండేయుడు .
సప్తర్షుల ద్వారా మార్కండేయుని గురించి తెలిసిన
బ్రహ్మ , మార్కండేయుని శివారాధన చేయమని చెప్పి ,
తానుకుాడా శివుని కొరకు తపస్సు చేసి  ప్రత్యక్షమైన
శివునితో మార్కండేయుని చిరంజీవిగా చేయమన్న 
అర్ధింపు.

విషయం విపులంగా తెలిసిన నారదుడు యమునికి
విషయం వివరించి 16 వత్సరముల తరువాత మార్కండేయుని
చంపకపోతే  యముని శ్రేయస్సుకు యశము చేకుారదని చెప్పి ప్రేరేపించి  , తక్షణం, మార్కండేయుని
దగ్గరకు వెడలి శివారాధన వీడక చేయుమని 
చెప్పగా , మార్కండేయుడు  నిరంతర శివారాధలనలో
లీనమౌతాడు.
అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్న మార్కండేయుని
చంపుటకై యముడు  వేసిన పాశం , శివ లింగాన్ని కౌగలించుకొని ఉన్న మార్కండేయుని దరికి కుాడా చేరదు.
శరణార్ధియైమ మార్కండేయుని యమ పాశ విముక్తుణ్ణి
చేయుటకై స్వయం పరమేశ్వరుడే లింగము నుండి 
కాలరుాపుడై ఉద్భవించి యమునిపైకే పాశాన్ని 
వేయబోతాడు.
అది గ్రహించిన యముడు,  తనను క్షమించమని మహా శివుని వేడుకుంటాడు.
యముణ్ణి క్షమించిన శివుడు మార్కండేయుని చిరంజీవిగా దీవించడం తో ఈ నాటికినీ శివారాధనలో
లీనమై జీవించే  ఉన్నాడు  మార్కండేయ మహర్షి ..

 గరుడ ,మార్కండేయ పురాణాల లో  మార్కండేయుడు  రచించిన పితృ దేవతా స్తోత్రాలు.మహా మృత్యుంజయ స్తోత్రం , చంద్రశేఖరాష్టకం ..
 మొదలైనవి  మార్కండేయ విరచితములు.

అఖండ భక్తితో శివారాధన  చేసినవారికి అపమృత్యుభయం తొలగిపోతుందన్న సత్యాన్ని 
తెలియజేసిన , మార్కండేయుని కథ ,
నిరంతర నిశ్ఛల భగవత్భక్తిలో
నున్న మహిమకు నిశ్ఛయమైన  తార్కాణము.

*******************************






No comments:

Post a Comment