Wednesday, January 12, 2022

శీర్షిక:అందని ద్రాక్ష------రచన :--కిలపర్తి దాలినాయుడుగారు. --------------------------------

శీర్షిక:అందని ద్రాక్ష
---------------------------------------------
కడుపులో కాలుతున్న సూరీడు
మకరంలా పేగులు కొరుకుతున్నాడు
ఆశల వాకిట్లో కోరికలు రథం ముగ్గు
పొడవెంతో గణించడం కష్టమే!

కేదారాలు మోయాల్సిన రైతు రాజు
ఇసుక మూటలు మోస్తున్నారు!
హరికథలుగా  సేద్యాగానికి కథలను
గానం చేస్తున్న దినపత్రికలు!

మంటల్లోకి కట్టై భోగీలో బూడిదౌతున్న
నాగళ్ల శరీరాలు!
పాడి పేడ దొరకని గహన ప్రదేశం
పల్లైనప్పుడు
గొబెమ్మలకు ఆన్ లైన్లో గిరాకీ!


వలస పోయిన
సంక్రాంతి ఉత్తరాయణం లోనికి నెట్టినా
కర్షకుని బతుకు "ఉత్తకాగితమే!
కనుమరుగైన పశుగణం
మాయమైన కనుమ పండుగ!

మెతుకు అందనిద్రాక్షేమరి!
-------------------------------------------
*కిలపర్తి దాలినాయుడు- సాలూరు*
మనుమసిద్ధి సాహిత్యవేదిక
సంక్రాంతి వచన కవితల పోటీ ఉత్తమ కవితగా నిలిచిన కవిత
అంశం:జీవన సంక్రమణం:

No comments:

Post a Comment