*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*
తేది: *19-01-2022: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
మ.సా.క.సం.: 19.
కవిత సంఖ్య : 1
ప్రక్రియ: పద్యము *చంపకమాల.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
.
1.
వనజభవాది వందితవు
వాజ్మయి శ్రీకరి హంస వాహినీ.
ఘన వర వీణ వాదిని,సు
గాన విలోలిని నాద మొాదినీ ॥
కనక సుభుాష ణీశుభ-సు
కామిని సుందరి సుప్రకాశినీ ॥
మనసున చీకటేలినది
మాకిల దారిని జుాపు
శారదే ॥
2.
మనసున మెల్గు భావముల
మానినులెల్లరు మెల్గ జుాడగన్॥
గనుమయ గావ రాగదటె
కాలము మారెను కంటకమ్ముగా .॥
ధనమగు మాన ప్రాణములె
దగ్ధములాయెను దైన్య రీతిలో ॥
దినములె హీనమాయెనుగ
దీన జనావన చక్రి బ్రోవగన్ ॥
No comments:
Post a Comment