8/02/2022
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...*
అంశం: మహిళా మహారాణీ .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : మహిళాలోకం నిద్రలేవాలి.
తరాలు కదిలిస్తే చాలు
మగువల కన్నీటి కథనాలు.
దాశ్య శృంఖలాల వేటలో
ఛిద్రమైన మహిళల జీవితాలు.
తరాలు మారినా రాని స్వాతంత్ర్యం
మహిళల ఉన్నతికి తీరని శాపం.
మారుతున్న కాలంలో మారణహోమాలు.
కామాంధులు పెరిగిన దేశంలో
కన్నుా మిన్నుా గానని ఆక్రమణ గోడులు.
అమ్మ తనంలో ఆడ తనాన్ని చుాస్తున్న
అల్పుల కామోద్రేక పుారిత క్రుారత్వాలు.
మహిళల బలహీనతకు సాక్ష్యమై
నిలచిన మరువలేని మానభంగాలు.
మహిళా సాధికారతపై
పురుషులు చేసిన ఉద్యమాలు..
మహిళలుగా మహిళల ఉన్నతికై
అడుగు ముందుకేసి విజయ పథానికి
చేరిన ఎందరో ఉద్యమ కారిణుల
సచ్చరితలు, చరిత్ర పుటల్లో చేరి
చెదలు పడుతున్నాయి.
తరాలు మారినా స్త్రీ ల
తల రాతలు మారలేదు.
నేటికీ అత్యధికంగా స్త్రీ లు
తమ మాన మర్యాదలను
కోల్పోతుానే ఉన్నారు.
ఎన్నో చట్టాలు మరెన్నో
స్త్రీ సంక్షేమ పథకాలు ..
అమలు కాని ఆర్భాటాలై
వత్సరాని కొక్కసారి "మహిళా దినోత్స"వాలకు
సారధులైన నేతల బాషల్లో
ఆదర్శ బాసలుగా బాణీలు కట్టబడి ,
అపస్వరాలాలాపనలై ఉపయొాగంలేని
ఉచ్ఛారణతో ముాలబడుతున్నాయి॥
ఇప్పటికైనా మహిళలు
మందడుగు వేసే ప్రయత్నం చేయండి.
మహిళా సాధికారతను సాధించే
పయనంలో "మేము సైతం "అంటుా
ఉద్యమయజ్ఞంలో హవిస్సుగా అర్ఘ్య
నినాదాన్ని పోసి స్త్రీ శక్తిని
రగులజెయ్యండి.
ఆగని పోరాటాగ్నిలో, అసందర్భ
ఆర్భాటాల భాషణ బాసలను కాల్చి వేసి
అధికారిత సాధికారతను స్వంతం చేసుకోండి..
జై స్త్రీ శక్తి..
హామీ: నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment