నమస్కారం . నాపేరు..
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
ఫిబ్రవరి 13 న జాతీయ" మహిళా దినోత్సవం"
మరియు మార్చ్ 8 వ తారీకున
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...*
' సాహితీ బృందావన జాతీయ వేదిక '
" మగువ మహారాణి " అనే అంశంపై యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ స్థాయిలో..
మహిళలకు పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా -
నేను రాసిన కవిత.
ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని
అన్ని రంగాల లోనుా
మగవాడితో సమానంగా
ఎదుగుతున్న మహిళలు
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
అనుబంధపు పరిమళాల పుాలు.
ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు
తరుణీ మణుల ఉద్యమ, వీర
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.
మచ్చుకకు
వేదద్రష్టలు మంత్ర దర్శినులు
మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలైన
24 మంది వనితలు విద్యా వినయ సంపన్నులు.
పండితురాలైన గార్గి , బ్రహ్మజ్ఞాని.
పురుషులతో పాటు సమంగా గార్గి కూడా
ఉపనయనం చేసుకుని శాస్త్ర చర్చ చేసిన
మహా మనీషి.
మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్య.
గార్గితో సమానమైన పండితురాలు
ఘోష ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత.
అలివేలమ్మ కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో పాల్గొనడమేగాక
మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు
భారతకోకిల సరోజినీనాయుడు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు.
లోక్ సభ సభ్యురాలైన లక్ష్మీబాయి స్త్రీలు, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసినవారు..
దుర్గాబాయి దేశ్ ముఖ్ తన 12 యేండ్ల వయసులోనే ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది
స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్, బిఎ ఆనర్స్ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌గా పేరుగాంచి
పద్మ విభూషణ్. గౌరవ డాక్టరేట్,
నెహ్రూ లిటరసీ అవార్డ్ లేగాక
యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డును గ్రహించిన గొప్ప వనిత..
"భారత కోకిల "సరోజినీ నాయుడు స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి , అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.[
ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా
మొాదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో
ప్రముఖ పాత్ర పోషించింది ఝాన్నీ రాణీబాయి.
రచయిత్రి మాలతీ చందూర్
భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన
గొప్ప రచయిత్రి.
ఇల్లిందల సరస్వతీదేవి ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించిన తొలి తెలుగు రచయిత్రిగా ఆమె చరిత్రకెక్కారు.
మంజుల ప్రదీప్, మరొకరు ముగ్దా కల్రా.లు. వీరు
అతి పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయ మహిళలు.
సావిత్రిబాయి పూలే
సమాజంలో దళితులకు, మహిళలకు, వితంతువులకు, బాలికలకు విద్య మరియు గౌరవాన్ని సాధించిన మహిళ ఆమె. సావిత్రిబాయిని భారతీయ మొదటితరం స్త్రీవాదిగా వర్ణిస్తారు.
అంతేకాదు
భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్
భారత దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ
భారతదేశపు మొట్టమొదటి మహిళా వ్యోమోగామి కల్పనా చావ్లా
భారతదేశపు మొట్టమొదటి సైనికురాలు పునితా అరోరా/ప్రియా జింగాన్
భారత నేవీలో మొట్టమొదటి మహిళ సుభాంగి స్వరూప్
ఒలింపిక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి మహిళా కిరణం కరుణం మళ్లీశ్వరి
ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళ పి.వి.సింధు
మొట్టమొదటి మిస్ వరల్డ్/మిస్ ఇండియా రీటా ఫెరియా పావెల్
మొట్టమొదటి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్
భారత మొట్టమొదటి మహిళా గాయకురాలు రాజ్ కుమారి దూబే
భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనంది గోపాల్ జోషి
మొట్టమొదటి నోబెల్ అవార్డు పొందిన భారత మహిళ మదర్ థెరిసా
మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ
మొట్టమొదటి మహిళా రైడర్ రోషిణి శర్మ
మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ శీలా డావ్రే
టెస్టులో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ అంజలి గుప్తా
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి ఎం.ఫాతిమా బీవి
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ దుర్గా బెనర్జీ
ఆస్కార్ పొందిన మొట్టమొదటి భారత నటి భాను అతయా
భారత్ నుంచి మొట్టమొదటి 'వరల్డ్ మిస్టర్&మిసెస్ అదితి గోవిత్రికర్
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ అవని చతుర్వేది
మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి అన్నా జార్జి
ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ మేరీ కోమ్
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్ లక్ష్మీ సెహగల్
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ బచేంద్రిపాల్
ఇలా చెప్పుకుంటే చరిత్ర పుటల్లో
మణిపూసల్లాంటి ఎందరో గొప్ప మహిళలు.
ఎన్నో రంగాల్లో మహోన్నతమైన కీర్తి
ప్రతిష్టలకు ప్రతీకగా నిలచినా వారు.
అటువంటి స్త్రీ ...
త్యాగానికి ప్రతి రుాపం
ఇంటింటా వెలిగే ప్రేమ దీపం. ॥
No comments:
Post a Comment