మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన పాట
పగలే వెన్నెలా ....జగమే ఊయలా...
పాటకు పేరడీ
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .
మహిళా మణులు ఈ, జగతికి రాణులుా
మహిళ ఇలను సబలె గాని అబల కాదుా...॥
పుట్టినింట ఆనందము పంచు రాణిగా
మెట్టినింటను జ్యోతియై వెలుగు లక్ష్మి గా
కష్టసుఖములందు ఆమె తోడు నీడగా
నెరవేర్చును బాధ్యతలను అర్ధ భాగిగా
పెనిమిటి పిల్లల.. పాలిటి వరముగా
మగువే గృహసీమను ఏలు రాణిగా..॥
వేద వైద్య విజ్ఞానము లేలు బాటలో
విద్యలందు ఆరితేరె విజయ పథములో
నవరసమ్ము లేలు కళా రంగాలలో
నడుముగట్టి నడచె స్త్రీ లు ప్రగతి బాటలో
పురుషుల నీడగా బాధ్యత తోడుగా
మహిళలె.. మహిని నిలచి జయము లేలెగా॥
తెల్లదొరల నొడ్డి పోరు నాటి జోరులో
స్వాతంత్ర్యము కోరి, శాంతి ,గాంధి బాటలో
బానిస సంకెళ్ళు తృుంచ ఉద్యమాలలో
శక్తి రుాపులై నిలచిరి స్త్రీ లు వేలలో
సాహస మేలినా మహిళలు ఎందరో
స్త్రీ శక్తికి రుాపాలై నిలిచె గెలుపులో ॥
కత్తి పట్టెవీర నారి ఝాన్సి లక్ష్మి గా
దేశ మేలె ఇందిరమ్మ ఎన్నో ఏళ్ళుగా
మహిళ సాధికారతకై ఉద్యమించెగా
ఆకసాన సగ భాగిగ కీర్తు లేలెగా
భరత చరిత పుటలలోమకుటాయమానులై
మగువలు మహరాణుగ ఖ్యాతి గాంచెగా॥
No comments:
Post a Comment