రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : స్త్రీ పురుషుల సమానత్వం,
అర్ధనారీశ్వరతత్వం
ప్రకృతి పురుషుల కలయిక
సృష్టి కార్యానికి ఆరంభం.
శక్తి లేనిదే సృష్టి కి ఆలంబనుండదు
పురుషుడులేనిదే సృష్టి కి ఆరంభం ఉండదు.
ఇరువురి కలయికతో జరిగిన
సృష్టిలో స్త్రీ పురుషులిరువురిలోనుా.
అంతర్గతంగా దాగి ఉన్న స్త్రీ పురుష
కణాల భాగస్వామ్యం తో వచ్చిన
జన్మలకు , పుట్టునప్పటినుండే
లింగ వివక్షతల విభజనలు దేనికి..?
ప్రతీ మనిషిలో అంతర్గతంగా
దాగి ఉండే శక్తులు శారీరిక రుాపేణా
విభజించిన కారణంగా ఒక శక్తి
అణగారిపోతుా వేరొకశక్తి అహంకరిస్తుా
ప్రకృతి ధర్మానికి వ్యతిరేక దిశలో
జీవితావగాహనలను కోల్పోతున్నారు.
లింగ వివక్షతల కారనణంగా శారీరిక
బలహీనతల దోపిడీలు హింసలు
మానభంగాలుా జరుగుతున్నాయి.
అందరిలోనూ అంతర్గతంగా ఉన్నపురుష,
స్త్రీ ధర్మాల రెంటి మధ్య ఒక సమతౌల్యాన్ని
ఏర్పరచుకో గలిగితే మన జీవితాన్ని మనం
మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకోగలుగుతాం.
నేటి భౌతిక ప్రపంచంలోే
స్త్రీపురుషులు సరిసమానంగా పాలు
పంచుకొనేందుకు అనువైన పరిస్థతులు
ఎన్నో కల్పించబడ్డాయి.
స్త్రీ లకొరకు సంక్షేమ పథకాలు
ఆరక్షణాకేంద్రాలుా అడుగడుగునా
నెలకొన్నాయి.
ఇలాగే స్త్రీ పురుషులు సమానంగా
పాలు పంచుకోగల ఆధ్యాత్మిక, మనో వైజ్ఞానిక ప్రపంచాలను గూడా ఏర్పరచుకొనేందుకు
అనువైన సమయం వచ్చింది.
స్త్రీత్వ, పురుషత్వ ధర్మాలు రెండూ
సమానంగా పని చేస్తేనే, మనుషులు
అంతర్గతమైన వికాసాన్ని
అనుభవించ గలుగుతారు. వారిరువురుా
మన భవితకు మంచి మార్గదర్శకులౌతారు.
No comments:
Post a Comment