Saturday, February 5, 2022

ముందడుగు

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత కోసం చదువుతున్న కవిత.

శీర్షిక : ముందడుగు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

మారుతున్న సమాజంతో పాటు
ముందడుగు వేస్తున్న మహిళలు.
పురుషులతో సమానంగా అన్ని
రంగాల లోనుా నిష్ణాతులైన ఘనం.
స్త్రీ  పురుష తారతమ్యాలకు అడుగు
ముందుకేయలేని స్త్రీ ల బలహీన స్థితి.
స్వాతంత్ర్యం వచ్చి 70 వత్సరాలు దాటినా
స్త్రీ ల విషయంలో సరిజేయలేని చట్టాలు
స్త్రీ  జీవితాలకు విడుపులేని శాపాలు.
ఒకప్పుడు నిర్భయ మరోనాడు ప్రియ
మరోనాడు పసి బిడ్డ మరోనాడు పండు ముసలి
ఇలా..వావి-వరసలు  మరచిన అకృత్యాలు.
అవనిలో పరిపాటైపోయాయి.
వికృత చేష్టల సాముాహిక బలాత్కారాలు
అబలల కు ఆత్మరక్షణ లేని ఆక్రోశాలయ్యేయి.
ఎన్నో పథకాలు మరెన్నో చట్టాలు
అసమర్ధత నిండిన ఆలోచనలకు నెలవయ్యేయి.
ఈ విషయంలో మహిళలే మహిళలకు
సంపుార్ణ మద్దతునివ్వాలి.
చేయి చేయి కలిపి పిడికెలు బిగించాలి.
మహిళా ఆరక్షణా కేంద్రాల సహాయంతో
అడుగు అడుగుకుా ఎదురౌతున్న
అవరోధాలను  అంతం చేయాలి
రాజ్యాంగ మార్పులతో పాటు  మహిళల
భద్రతకై చట్టాలు అమలు చేయబడాలి.
తప్పు చేసిన వాడికి తగిన శిక్షను
సకాలంలో పుార్తి చేయగలిగే సమర్ధత
మన రాజ్యాంగ సవరణల లో చోటు చేసుకోవాలి
పురుషుడిలో అర్ధభాగమైన స్త్రీ ..
పురుషాధిక్యతకు బలౌతున్న పరిస్థితిని
కుాకటి  వేళ్ళతో  పెళ్ళగించాలి.
శక్తి లేనిదే శివుడు లేడు అన్న మాటకు
అర్ధనారీశ్వరుడే సాక్ష్యమై ఆది పురుషుడయ్యేడు.
సృష్టి కి ప్రతి సృష్టి చేసే అమ్మ రుాపులో
ఆడ తనాన్ని తప్ప మరొక పవిత్ర
భావానికి చోటివ్వని క్రుారత్వాన్ని
కుాకటివేళ్ళతో పెకిలించాలి.
ఎనాడైతే స్త్రీ  అర్ధరాత్రి కుాడా
భయపడని సామాజిక పరిస్థితి వస్తుందో
ఆనాడే మనకు అసలైన స్వాతంత్ర్యం
వచ్చిందన్న భావంతో మనం మన
జాతీయ ఝండాను తలెత్తుకు ఎగరేయాలి.


No comments:

Post a Comment