శీర్షిక : జనన మరణ యానం.(జీవితం).
గీత రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
👌👌👍💐🌻🌹
పల్లవి:
*******
జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ తెలిసేది ఎన్నడో..
అనుపల్లవి:
*********
ఈ పుడమిలో జన్మ ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥
1.చరణం.
*********
జీవితం తిరుగాడు వలయం
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం
నింపావహంకార తిమిరం
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం
పోయినదంతా వెనుకకు రాదుా
మిగిలినదాంతో తృప్తిరాదుా ॥
2.చరణం.
*********
ఎంతెత్తు కెదిగినా నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥
3.చరణం.
*********
స్వార్ధమెంచి దుారమవకు అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
ప్రాణమెగిరిపోయినా కదలదు నీకాయము
ఓనలుగురి సాయమే కాటిజేర్చు సాధనము.
ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
తుదికి మట్టిలోనె కలియుటే బ్రతుకు రహస్యము ॥
*******************************
రాగం : .కీరవాణి రాగం ఆధారం కై"ని" అన్యస్వర ప్రయొాగం గా వాడారు. బాగుంది ఎవరు పాడారండీ?
No comments:
Post a Comment