హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
శీర్షిక : ఓ మనిషీ ! మేలుకో !
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
జీవితంలో అనుకోని మలుపులు.
గుర్తుకు వచ్చే సంఘటనలతో
గుండె భారం చేస్తున్న జ్ఞాపకాలు.
ఒకప్పుడు..
మనదేశం మన సంస్కృతి అంటుా
ఇంటినుండి మొదలైన సాంప్రదాయ
వ్యవహారాలు స్కుాల్ కాలేజీల పరిధిలో
కుాడా పరువు సంపదకు పట్టం గట్టేవి ॥
రోజు రోజుకుా కాలం తో పాటు
మారుతున్న మనిషి తాను ఎందుకు
బతుకుతున్నాడో తెలీని అయొామయంలో
మెదడును మధించి అమృతమనుకొని
హాలాహలాన్ని తాగుతుా ఆనందిస్తున్నాడు.॥
రాజకీయ వైఫల్యాలకు
రంగులు మారుతున్న నీతి న్యాయాలకు
నిలకడ లేని తీర్పులతో దేశ చరిత
తిరగబడి అల్లకల్లోలమైపోయింది.
మనిషి మరచిన మానవత్వానికి
మొాడర్న్ లైఫ్ అనే పేరుపెట్టి ,
కుతంత్రాల ఊబిలో
కర్కశంగా కుారుకుపోతున్నాడు.
వావి వరుసలు మరచిన వరుస
దురాగతాలకు వందేమాతరం
దేశభక్తి గీతం తాళం తప్పిన
పాటై , అపశృతులుపలుకుతోంది.
అశ్రమాలలో అరలో బొమ్మల్లా
అమ్మా నాన్నలు,అవసరాల
మీడియాలను ఆదుకొనే
సమాచారమై నిరుద్యోగులకు
పెట్టుబడికి మాధ్యమాలౌరున్నారు ॥
మొబైల్ జీవితానికి అలవాటు పడిన
పిల్లలు , మిథ్యా ప్రపంచపు మత్తులో
నిజ జీవిత విలువలను కోల్పోతున్నారు.
టి.వి.మాధ్యమాల్లోవచ్చే కఠిన కర్కశ
పదజాలాల పనికిరాని అశ్లీల కథనాల
అంతరంగాలలో పరకాయ ప్రవేశంచేస్తుా
నీ..నా.. బంధాలను తెంచుకుంటున్న
మన జీవితాలు నడి సంద్రపు నావ చందమై
ఎటు పోవాలో తెలీని అయొామయ స్థితిలో
కొట్టుకు పోతున్నాయి.
ఓ !మనిషీ ! నీ " లో " నున్న నిన్ను
తట్టి లేపు.
మహోన్నుతుడవై "మనీషి" గా ఎదుగు.
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
****************************
No comments:
Post a Comment