"కవన కిరణాలు"
తెలుగు సాహితీ సమాఖ్య.
ముాడవ కవితా సంకలనం కొరకు...(పంపినది)
శీర్షిక : నా దేశం.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంతస్తుల కొలమానం
అడుగడుగునా రగిలే గోళం
రోజు రోజుకుా దిగజారుతున్న
నైతిక విలువల సంస్కారం .
ఆకలి వేసిన వాడికోసం అన్నదాతలు
పడే కష్టానికి లేదేదీ కొలమానం.
ఆత్మహత్యలే వారికి శరణ్యం.
అడుగు ముందుకేసిన అబల
అన్నిరంగాల లో సాధించిన విజయం.
అంగట్లో బొమ్మైవనిలిచిన శాపం॥
ఓటు హక్కును" నోటు కోసం
అమ్ముకుంటున్న జనం .
మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారం
మత్తులో తేలుతున్న మనిషి జీవితం .॥.
చిరిగిన ఝండా నిండా వెలిసిన రంగులు.
అట్టుడికిపోతున్న బడుగు బతుకులు.
ధర్మ చక్రం చుట్టుా నిండిన చెదలు
బానిసత్వపు బరువు నిండిన కలలు.
రణ నీతుల్లో ప్రైవేటీకరణల జోరులు .
దోచుకోబడుతున్న దేశ సంపదల
దిన దిన గండపు హోరులు .
అరవై సంవత్సరాల స్వాతంత్ర్య బాట.
అమ్మకానికి పాడుతున్న వేలం పాట.
నాటి ఉద్యమ కారుల శిల్ప ఖండితాలు
దేశ శివారుల్లో గుట్టలైన వైనం
స్వాతంత్రోద్యమ కారుల చరితలు
పుస్తక పుటలకే అంకితం ॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment