Saturday, January 29, 2022

జణ మరణ వలయం

28/01/2022.
మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : ఐచ్ఛికం.

మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 2.


శీర్షిక  : జనన మరణ వలయం.
(గీత రచన ).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

పల్లవి:

జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..

అనుపల్లవి:

ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥

1.చరణం.

జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు మరలీ రాదుా
మిగిలినదాంతో నీకు  తృప్తిరాదుా ॥

2.చరణం.

ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
నీ నా...తేడాల మధ్య చితికిపోవు నిత్యం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥

3.చరణం.

స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
 ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
 ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
 ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
 తుదకు మట్టిలోనె కలియుటదె బ్రతుకు రహస్యము ॥

*******************************

No comments:

Post a Comment