[12/27/2020, 21:04] p3: 27/12/2020
వారం వారం గోరసం వారి కధానిక శీర్షిక పోటీ కొరకు..
అంశం : సహనం.
శీర్షిక : ఇల్లాలు.
అమ్మ రోజుా పొద్దున్నే లేచి ఆదరా బాదరా పరుగెత్తుతున్నట్టే పని చేసేది. నన్ను తమ్ముడిని స్కుాల్ కు తయారు చేసేందుకు , నాన్నకు, చిన్నాన్నలకు భోజనానికై కేరేజీలు కట్టేందుకు...
నానమ్మ పుాజకు నైవేద్యం కోసం ప్రసాదం చేసిచ్చేది .
అత్తయ్యలకోసం కాఫీ ఫ్లాస్క్ లో పొిసి ఉంచేది.
అటు తర్వాత మా స్కుాల్ బేగ్ లు తను మొాస్తుా
మమ్మల్ని స్కుాలుకు తీసుకు వెళ్లేది.
మధ్యలో మార్కెట్ కు వెళ్ళి రోజుా కావలసిన కుారలు సామానులు తీసుకు వచ్చేది .తిరిగి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకడానికని స్కుాల్ కు వచ్చేది. అటుపై మళ్ళీ పరుగులే ..మాకు టిఫిన్ పెట్టి, రాత్రి వంట చేసి , మా ఇద్దరి చేత హోమ్ వర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యేక గిన్నెలన్నీ తోమి , తిరిగి పొద్దున్న మాకోసం చేయవలసిన టిఫెన్స్ కోసం అన్నీ రెడీ గా పెట్టుకొనేది. పనమ్మాయిని పెట్టుకొమ్మని అంటే ..మీ ఇద్దరుా బాగా చదువుకొని పెద్ద ఉద్యాగాలు చేస్తే అప్పుడు హాయిగా పనమ్మాయిని పెట్టుకుంటాననేది.
ఆపై మా స్కుాలు యుానిఫామ్స్ ఇస్త్రీ చేసి పెట్టేది.
పడుకోడానికే రాత్రి పదకొండు దాటేది. ఆది వారాలు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. రోజుా తెల్లారి నాలుగుకే లేచే అమ్మ ఇల్లంతా సుభ్రం చేసి , వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం తో మొదలైన దిన చర్య...
రాత్రి పదకొండు దాకా సాగేది. అంత పని చేస్తున్నా ముఖంలో అలసటని మరపించే చిరునవ్వు పులుముకొని , మా అల్లరిని భరిస్తుా...
నాన్న విసుగును సమర్ధుస్తుా , నానమ్మ సాధింపుకు తలవంచుతుా..ఎంతో సహనంతో ఇంటి పనులు చేసుకుపోతున్న అమ్మని చుాస్తుా ఉంటే నాకు ఆశ్ఛర్యం వేసేది
కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమ్మ విలువ నా పెళ్ళి అయ్యేదాక దాక నాకు తెలియనే లేదు. అన్నీ అమ్మని అడిగి చేయించుకొనే నేను ఒక్క రోజు కుాడా అమ్మకు చేతి సాయాన్ని అందించ లేదు. కనీసం బయట పనైనా చేసేవాడిని కాదు. పైగా అమ్మ నేను అడిగింది చేయలేదని విసుక్కునే వాడిని. అలిగే వాడిని ..తమ్మడు మరో రకంగా అల్లరి...అన్నీ ఆనందంగా భరిస్తుా బండెడు చాకిరీని చేస్తున్న అమ్మ నాకు నా ఇల్లాలిలో కనిపించేది.. సహనానికి మారు పేరైన ఇల్లాలు. తన ఊరు పేరుా మారినా , తన పనితనం, సహనంతో మరో ఇంటికి దీపమై వెలుగు నింపుతున్న నిస్వార్ధ కర్మచారిణి కదుా ఇల్లాలు.
ఒక ఇంట్లో పుట్టి వేరొకరింటిని మెట్టి అక్కడివారందరినీ తనవారిగా భావించి , నేను నా ఇల్లు , నా పిల్లలు, నా పరివారం, అన్న అంకిత భావంతో
ఎంతో ఆనందంగా తనని తాను అర్పించుకున్న ఒక ఇల్లాలిని మించిన సహన శీలి వేరెవరుంటారు...?
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
[12/29/2020, 20:02] +91 99084 50790: *గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక పోటీ ఫలిరాలు*
*(పోటీ జరిగిన తేదీ: 27-12-2020)*
1. శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి - ముంబయ్ (ప్రధమ స్థానం)
2. డా.. వేదాల గాయత్రీదేవి - విశాఖపట్నం (ద్వితీయ స్థానం)
3. శ్రీమతి పోతేపల్లి విజయలక్ష్మి - హైదరాబాద్ (ద్వితీయ స్థానం)
4. శ్రీమతి కె.శైలజ శ్రీనివాస్ - విజయవాడ (తృతీయ స్థానం)
5. శ్రీమతి వి. సంధ్యారాణి - నిర్మల్ (తృతీయ స్థానం)
6. శ్రీమతి మంజీతకుమార్ బందెల - బెంగళూరు (తృతీయ స్థానం)
7. శ్రీమతి కొమ్ము సాగరిక - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
8. శ్రీమతి ఎం.వి.ఉమాదేవి - నెల్లూరు (ప్రోత్సాహక స్థానం)
9. శ్రీమతి దేవలపల్లి సునందరెడ్డి - రంగారెడ్డి (ప్రోత్సాహక స్థానం)
10. శ్రీమతి ఎం.టి.స్వర్ణలత - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
11. శ్రీమతి మంజులా శ్రీనివాస్ - హైదరాబాద్ (ప్రోత్సాహక స్థానం)
12. శ్రీమతి రెడ్డి పద్మావతి - పార్వతీపురం (ప్రోత్సాహక స్థానం)
13. శ్రీమతి బోర భారతీదేవి - విశాఖపట్నం (ప్రోత్సాహక స్థానం)
*ఈవారం నిర్వహణ*
శ్రీ కంచుమారికి చిన్నారావు
కవి - ఉపాధ్యాయుడు
విశాఖపట్నం.
No comments:
Post a Comment