Wednesday, March 30, 2022

పరిచయం

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాము.   ఎక్కువగా కీర్తనలు , లలితసంగీతం పాటలు రాసి ట్యుాన్స్ కడతాను . "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన  శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం నాకు గర్వకారణం. అవికాక 8 CD లు వివిధ గాయనీ గాయకు లు పాడినవి , పుార్వ గవర్నరు గారైన "విద్యాసాగర్ గారి చే కొన్ని , కుర్తాళం స్వామివారిచే "కొన్ని,  శారదా సుబ్రహ్మణ్యం గారి చే కొన్ని ఆవిష్కరింపబడ్డాయి. అవేకాక కవితలు,కధలు కుాడా రాస్తాను. ముంబాయి ఆంధ్రమహా సభ , వాషి తెలుగు కళా సమితిలలో పలు కార్య క్రమాలలో  పాల్గొని సన్మాన పాత్రురాలినయ్యేను.

పలు సంఘాల లో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాల లో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు   పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు  లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
హైదరాబాదులో జరిగిన శివపద సప్తాహంలో నాచే స్వరపరచబడిన కీర్తనలను, నాతో కలిపి , బోంబే సంగీత కళాకారిణులందరికీ పాడే అదృష్టం గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారు కల్పించేరు. కరోనా కారణంగా
ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో పలు పద్యాలే గాక "సంపుార్ణ సుందరకాండ"
ను పాటవెలది ప్రక్రియలో  రాసేను .వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందేను.

నమస్తే దినపత్రికలో , సాక్షి పేపర్ , నవ తెలుగు తేజం మాస పత్రికలో, వాషి (ముంబై ) తెలుగు కళా సమితి వారి దిక్సూచి లో నా కవితలు, కధలు ప్రచురింపబడుతుా ఉంటాయి  ". ప్రతిలిపి" లో కధలు కవితలకు సన్మానం అందుకున్నాను. 
ప్రతిలిపిలో నేను రాసిన రచనలు..
కధలు కవితలు కలిపి 950..
కీర్తనలు,  లలిత గీతాలు , భక్తి గీతాలు , సప్త తాళ కీర్తనలు , తెలుగులోనికి తర్జుమా చేసి రాసి స్వరపరచిన 39 పాశురాలు , వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 300 పై చిలుకుగా ఉన్నాయి.

కధలు ,కవితలు, ఛందస్సు తో కుాడిన పద్యాలు
రాయడం చాలా ఇష్టం.
లలిత-సంగీత గేయాలను,  కీర్తనలను , వర్ణాలను రాయడం, స్వరపరచడం ,పాడడం చేస్తుా ఉంటాను

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటున్నాను.

******************************************

బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.

1. "సాహిత్య చక్రవర్తి. "
( ఇష్టపది ప్రక్రియలో )
సృష్టి కర్త : అడిగొప్పుల సదయ్యగారు.
. (మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)

2. "స్వర మయుారి." (చిలక పలుకులు ప్రక్రియ లో)
చెన్నుారు సాహితీ వేదిక నుండి....
( రుాపకర్త . చిలకమారి తిరుపతిగారు).

3."వెలుగు దివ్వె".
తెలంగాణా తెలుగు కళా నిలయం నుండి
(చిమ్నీలు ప్రక్రియలో)
రుాపకర్త: జాదవ్ పుండలీక్ రావ్.

4.శత తేనియ పురస్కారము  .
(తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
(.తేనియలు ప్రక్రియలో)
(రుాపకర్త..నలుమాసు విజయ ప్రసాద్ ).

5. "మధుర కవి భుాషణ" బిరుదు ప్రదానం .
(శతాధిక మధురిమలు  ప్రక్రియకు గాను.)

7. మేఘన సాహితీ కళా వేదిక నుండి.
8.  (మధురిమలు ప్రక్రియలో)
(రుాపకర్త. ఈర్ల సమ్మయ్య గారు).

6."అక్షర ఝరీ రత్న"  ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి నుండి పరిమళాలు ప్రక్రియలో..
(పాటలుగా 30 పాశురాలు రాసినందుకు)

7.."పద ముత్యం" బిరుదు.
గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎడ్యుకేషనల్ &
రుారల్ డవలప్ మెంట్ సొసైటీ  వారి నుండి
  ( ముత్యాల పుాసలు శతాక్షరి ప్రక్రియలో)

8.
"సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు. ఉగాది 2021.ఉగాది పురస్కారం. (ఖమ్మం తెలంగణా).

9. ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారిచే
అద్వైత పురస్కారం .
( కృపాణాలు ప్రక్రియలో)

10." రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."
(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
(ఇంటర్నేషనల్  ఉమెన్స్ డే  2020.నాటి కవితకు )

11. "సమాజ సార్థక్ అవార్డ్ " (ఇంటర్నేషనల్ ఉమాన్స్ డే--2020..నాడు
(సుార్యపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).

12. "విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)

13.సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి  సాహిత్య పురస్కారం...2021.

14. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..
15. "సున్నితం" బిరుదు.

16. రవీంద్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.

18. సాహితీ బృందావన జాతీయ వేదిక వారి

           కాళోజీ సాహితీ పురస్కారం.
          
16.  కవి కోకిల బిరుదు.
(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)

*******************************:**
ఇవి నాకు ఇప్పటి వరకు నాకు లభించిన
బిరుదులు ,  పురస్కారాలు.
*********************************:::

Tuesday, March 8, 2022

అంశం : యుద్ధం లో ప్రథమబహుమతి పొందిన కవిత.

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక
కవితల పోటీకై
 అంశం : యుద్ధం
శీర్షిక : యుద్ధ భాష 
**************************
రచన : అన్నం శివకృష్ణ ప్రసాద్
చరవాణి :9490325112
**************************
నీ ప్రమేయం లేకుండానే 
జీవితం ఒక అనివార్యమైన
పరిస్థితిలోకి నెట్టబడుతుంది
మేఘాలు సమరగీతం పాడుతాయి..!

తరగతి గదులన్నీ
సెలవులు ప్రకటించుకుంటాయి
నిత్యావసరాలన్నీ
ధరలరెక్కలు తొడుక్కుంటాయి..!

ఎవరు మోగించిన యుద్ధభేరీనో
నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంటుంది
నీవు కోరని నిర్భందాన్నెవరో 
నీపైన విధిస్తారు..!

ఆకలీ.. దోపిడీ..
నడివీధుల్లో జట్టుకట్టి ఆడుతాయి
 కురుస్తున్న నిప్పులవాన సాక్షిగా
నీ జాతీయ జెండా రోదిస్తుంటుంది 

ఇక్కడ వేరెవరి కలల పతాకాలో 
మారణహోమాన్నెగరేస్తుంటాయి 
నీ తోటలోని గులాబీలపై
ఇంకెవడో హక్కుల పత్రం రాసుకుంటాడు

నిశ్శబ్దంగా దృశ్యమార్పిడి జరిగిపోతుంది
నీ కలలసంతకం వాడు చేస్తాడు
నీ మాటకు తాను భాష్యం చెబుతాడు
నీ నేలపైనే నిన్ను శరణార్థిని జేస్తాడు
పిడికిలెత్తి ప్రశ్నిస్తే
నీ హక్కుల హననమే తన లక్ష్యమని
యుద్ధభాష లో ప్రకటిస్తాడు..!
********************************
ఆర్యా నమస్కారం..!
పై రచన నా సొంతమని హామీ ఇస్తున్నాను
*********************************

Monday, March 7, 2022

ఓ స్త్రీ ..నీది గెలుపా ఓటమా..?

మహిళా దినోత్సవసందర్భంగా.. 

శీర్షిక  : ఓ స్త్రీ ..నీది గెలుపా ఓటమా..?

మహతీ సాహితీ కవి సంగమం .
17/02/2023.
శీర్షిక  : ఈ ప్రశ్నకు బదులేదీ.....
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

అసహనాల వెనక దాగి ఉన్న కన్నీటి
 సాగరాన్ని తనలో దాచుకుంటుా...
 పుట్టినింట్లోనే ఆడపిల్లగా అనుభవించిన
 కట్టుబాట్ల సంకెళ్ళు తెంచుకోలేకా..
 అత్తింట ఆరళ్ళకు , పరువు మర్యాదల 
 సంస్కారాలను తుంచి బయట పడలేకా..
 ఆడుగడుగునా ఎదురౌతున్న 
 అవమానాలను ఎదిరించి 
 పోరాడే  ధైర్యం లేకా...
 ఆమె కుమిలిపోతుా కుాడా
 చిరునవ్వు ముసుగులో కన్నీటి
 అలల్ని  దాచుకుంటుా....
 ఆడ దానిగా ఎందుకు పుట్టేనా అని
  ఆనుక్షణం కుమిలిపోతుానే ఉంది ॥
   నాటి నుండి నేటివరకు వచ్చిన
  ఎన్నో మార్పులు ..అడుగు ముందుకు
  వేయడానికి తోడ్పడిన  ఓదార్పులు మాత్రమే ॥
  స్త్రీగా తనకు ఇప్పటికీ రాని స్వాతంత్ర్యం..
  పురుషాధిక్యతల అహంకారంలో
  అనుక్షణం బ్రతుకు బాటలో కుంగదీస్తున్న 
  భయంకర  నిజాలకు నిదర్శనం ॥
  కట్టుా బొట్టుా మారినా, వ్యధల కధల్లో,
  విషపు కాటుకి గురయ్యేది  స్త్రీ లేనన్న నిజం..॥
  మార్పు కోరుతుా ఎదిగిన సమాజం 
  మగువ బాటలో చేస్తోంది మారణహోమం.
  కామ వాంఛలతో కనికరం లేని మృగాల వేడికి
  సాముాహికంగా చేస్తున్న బలాత్కారాల 
  కర్కశ దాడికి ఆహుతౌతున్న యువతులు ,
నేటికీ సమాజంలో తీర్పురాని న్యాయానికి
మిగిలిపోతున్న బలిపశువులు. ॥
 ఏసిడ్ దాడుల కాలిన వాసనలు
 న్యాయం ఎంతకుా దొరకని కడుపు కోతల 
 కన్నీటి ఏరుల్లో కొట్టుకు పోతున్న 
 అవినీతి చర్యల విజయాలకు సాక్ష్యాలు॥
  ఏటేటా జరుగుతున్న మహిళా దినోత్సవాలు
 పురుషులతో సమానాధికారాన్ని  పొందగలరన్న 
 స్త్రీ  శక్తికి నిలువుటద్దాల సాక్ష్యాలై అన్ని.
 రంగాల లో ఎదుగుతున్న స్త్రీల 
 విజయాలకు  వీర తిలకాలు దిద్దుతున్నా
 మాటలతో కోటలు కడుతుా....
 చేతలతో చిదిమి వేస్తున్న నిజాలను
 గుర్తు చేస్తున్న అన్యాయాలకు సాక్ష్యాలు ॥.
ఈ తీరు మార్పుకు  ఎదురు తిరగలేని
స్త్రీ ల  శారీరిక బలహీనత  పెద్ద కారణమైతే....
మారని స్త్రీ ల జీవితాలకు  స్వార్ధం నిండిన 
పురుషాహంకారపు  మృగాధిపత్యంలో
రాని మార్పు , మరో కారణం.
మగజాతి కారణంగా స్త్రీ ల ఎదుగుదలకు 
అవరోధాలు కలిగే ఈ సమస్యకు  సమాధానమేది .?
స్త్రీ లకు అస్వతంత్ర్యతా భావన పోయేదెప్పుడు ?
ఈ అకృత్యాల అంతం అయ్యే దెప్పుడు..?
ఆడ ,మగల మధ్య సభ్యత సంస్కారాలు 
నిండిన  గౌరవప్రదమైన  సత్సంబంధాలు 
నిలచేదెప్పుడు?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవారేరీ.....?