మహిళా దినోత్సవసందర్భంగా..
శీర్షిక : ఓ స్త్రీ ..నీది గెలుపా ఓటమా..?
మహతీ సాహితీ కవి సంగమం .
17/02/2023.
శీర్షిక : ఈ ప్రశ్నకు బదులేదీ.....
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
అసహనాల వెనక దాగి ఉన్న కన్నీటి
సాగరాన్ని తనలో దాచుకుంటుా...
పుట్టినింట్లోనే ఆడపిల్లగా అనుభవించిన
కట్టుబాట్ల సంకెళ్ళు తెంచుకోలేకా..
అత్తింట ఆరళ్ళకు , పరువు మర్యాదల
సంస్కారాలను తుంచి బయట పడలేకా..
ఆడుగడుగునా ఎదురౌతున్న
అవమానాలను ఎదిరించి
పోరాడే ధైర్యం లేకా...
ఆమె కుమిలిపోతుా కుాడా
చిరునవ్వు ముసుగులో కన్నీటి
అలల్ని దాచుకుంటుా....
ఆడ దానిగా ఎందుకు పుట్టేనా అని
ఆనుక్షణం కుమిలిపోతుానే ఉంది ॥
నాటి నుండి నేటివరకు వచ్చిన
ఎన్నో మార్పులు ..అడుగు ముందుకు
వేయడానికి తోడ్పడిన ఓదార్పులు మాత్రమే ॥
స్త్రీగా తనకు ఇప్పటికీ రాని స్వాతంత్ర్యం..
పురుషాధిక్యతల అహంకారంలో
అనుక్షణం బ్రతుకు బాటలో కుంగదీస్తున్న
భయంకర నిజాలకు నిదర్శనం ॥
కట్టుా బొట్టుా మారినా, వ్యధల కధల్లో,
విషపు కాటుకి గురయ్యేది స్త్రీ లేనన్న నిజం..॥
మార్పు కోరుతుా ఎదిగిన సమాజం
మగువ బాటలో చేస్తోంది మారణహోమం.
కామ వాంఛలతో కనికరం లేని మృగాల వేడికి
సాముాహికంగా చేస్తున్న బలాత్కారాల
కర్కశ దాడికి ఆహుతౌతున్న యువతులు ,
నేటికీ సమాజంలో తీర్పురాని న్యాయానికి
మిగిలిపోతున్న బలిపశువులు. ॥
ఏసిడ్ దాడుల కాలిన వాసనలు
న్యాయం ఎంతకుా దొరకని కడుపు కోతల
కన్నీటి ఏరుల్లో కొట్టుకు పోతున్న
అవినీతి చర్యల విజయాలకు సాక్ష్యాలు॥
ఏటేటా జరుగుతున్న మహిళా దినోత్సవాలు
పురుషులతో సమానాధికారాన్ని పొందగలరన్న
స్త్రీ శక్తికి నిలువుటద్దాల సాక్ష్యాలై అన్ని.
రంగాల లో ఎదుగుతున్న స్త్రీల
విజయాలకు వీర తిలకాలు దిద్దుతున్నా
మాటలతో కోటలు కడుతుా....
చేతలతో చిదిమి వేస్తున్న నిజాలను
గుర్తు చేస్తున్న అన్యాయాలకు సాక్ష్యాలు ॥.
ఈ తీరు మార్పుకు ఎదురు తిరగలేని
స్త్రీ ల శారీరిక బలహీనత పెద్ద కారణమైతే....
మారని స్త్రీ ల జీవితాలకు స్వార్ధం నిండిన
పురుషాహంకారపు మృగాధిపత్యంలో
రాని మార్పు , మరో కారణం.
మగజాతి కారణంగా స్త్రీ ల ఎదుగుదలకు
అవరోధాలు కలిగే ఈ సమస్యకు సమాధానమేది .?
స్త్రీ లకు అస్వతంత్ర్యతా భావన పోయేదెప్పుడు ?
ఈ అకృత్యాల అంతం అయ్యే దెప్పుడు..?
ఆడ ,మగల మధ్య సభ్యత సంస్కారాలు
నిండిన గౌరవప్రదమైన సత్సంబంధాలు
నిలచేదెప్పుడు?
ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవారేరీ.....?
No comments:
Post a Comment