Wednesday, May 25, 2022

సర్పయాగము

*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగ
తేది:  *12-05-2022:గురువారం*
అంశం: *సర్పయాగం*
ప్రక్రియ: *ఇష్టపది*

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

ఉదంకోపాఖ్యాన ముదంత వృత్తాంతము
జగతి విస్తృతమాయె జనమేజయు యాగము ॥

మహర్షి పైలునిప్రియ మగు శిష్యుడుదంకుడు
గురు సేవ జీవితము గురు మాటే వేదము॥

అణిమాది సిద్ధులను ఆతడు ప్రాప్తి పొందెను
గురు దక్షణ నీయగ గుణుడు దలచె సతతము ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

రాజు పౌష్యుని సతి రాణి  కుండలాలను
గురు పత్నవి కోరెను గుంభనముగ నవ్వెను॥

గురు పత్ని యానతిని  గుణుడు స్వీకరించెను
జాగురుాకత తోడ జక్కగ గొన బోయెను॥

పతివ్రతగు రాణిని పద్ధతిగా నడిగెను
హర్షించి రాణిచ్చె నామె కుండలాలను॥

  తక్షకుడు  చోరుడని తరచి తరచి చెప్పెను
జాగురుాకత తోడ జాడ బోవలెననెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

మార్గ మధ్యములోన మంత్రానుష్టానమును
జేయ కుండలాలను  చెట్టు దరిని దాచెను ॥

తాన మాడు వేళను తక్షకుడే వచ్చెను
మహిమ కుండలాలను మాయ నపహరించెను  ॥

నాగ లోకమునతడు  నడి రంధ్రమున దాగ
నమ్మిక నుదంకుడుా నారాయణు వేడెను ॥

నాగలోక వశమౌ నటుల వరము కోరెను
అగ్ని జ్వాలల తోడ ఆరని పొగ బెట్టెను.॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

తక్షణమే వణకుచు తక్షకుడే వచ్చెను
కుటిల బుద్దిని వీడి కుండలాలనిచ్చెను ॥

గురుదక్షణ నిచ్చిన గురువు సంతసించెను
గురుకులమున విద్యయె గుణుడు పుార్తి చేసెను॥

గురుకులము విడినంత గురుతుగానుదంకుడు
తక్షకుల నాశముకు తరుణముకై వేచెను॥

ప్రతీకార వాంఛను ప్రతిగ దీర్చ దలచెను
ఆ నాగుల జంపుట కతడు ప్రతిన పుానెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

సర్ప యాగముజేయ సంకల్పము బుానెను
జనమేజయు నాతడు జతనము నొప్పించెను  ॥

తండ్రి పరీక్షిత్తుకు తగులు శాపము జెప్పె
శాప మెరిగిన కుటిల సర్ప యొాచన జెప్పె॥

మాటు వేయ దాగి కాటు వేయుట జెప్పె
తక్షకుండదె జంపె తండ్రి ననుచును  జెప్పె ॥

ప్రతీకారము నదియె   ప్రతిగ దీర్చుకొమ్మని
ప్రేరేపించి యతడు  ప్రేరణ కలిగించెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

రాజు మనము రగిలె రగిలించె యాగాగ్ని
సర్ప యాగ మదియె సరి జంప నాగుల ॥

హోతల మంత్రములకు హోమమెగసెను పైకి
పెరుగాగ్ని జ్వాలలో పరుగున బడె నాగులు॥

మంత్ర తీవ్రత జుాచి  మదిని యింద్రుడు వణకె
అగ్ని కాహుతౌచును అతడు తల్లడిల్లెను ।

ఆశ్రయించు తక్షకు డావెనుకే జారెను ॥
ప్రాణ భీతి తోడను  ప్రాకులాట లాడెను॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

సొిదరీ వాసుకీ  సొంత బిడడ్డు అతడు
నాగులను కాపాడు నాగ వంశజుడతడు 
 
కారణ జన్ముడతడు కరుణ దయ గలవాడు
ఆస్థీకుడను పేర నలరు రక్షకుడతడు ॥
 
నిలిపె యాగమునతడు నిశ్ఛయమ్ముగ నపుడు
తక్షకులము బ్రతుకగ దక్షణ దిశ కోరెను ॥

యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ
సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥

మహాభారతములో  మది కలచునది గాధ
ఆది పర్వములోనె  ఆరంభమైన  కథ ॥

ముని సుాతుడు జెప్పిన  ముఖ్యమైనదీ కధ.
సర్పయాగ విషయము  సరి శౌనకాదులకు ॥

సర్ప భయము లున్నను సత్కథను చదువుమా
సర్ప బాధ తొలగు  సత్య మిదియె వినుమా ॥

సర్పయాగపు మహిమ  సఖులంత చదువగా॥
యిష్టపదిలో రాసె నిచ్ఛతో నీశ్వరీ॥

************************************

No comments:

Post a Comment