Wednesday, May 25, 2022

మణి పుాసలు ప్రక్రియ

22/05/2022.
చైతన్య భారతి వారి మణిపుాసలు సంకలనం  కొరకు...
అంశం : స్త్రీల పై అత్యాచారాలు.

శీర్షిక : నాటికీ నేటికీ మారని చరిత

ప్రక్రియ : మణిపుాసలు.
సృష్టి కర్త : వడిచెర్ల సత్యంగారు.

రచన.:.శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నాడు

ఒకప్పుడు ఆడపిల్లలు
భ్రుాణ హత్యలకు నెలవులు
వంటింటి కుందేళ్ళుగా
బ్రతుకు బంధాల కొలువులు ॥

కన్యాశుల్కపు బాధలు
అడుగడుగునవమానాలు.
సతీ సహగమనం వంటి
కర్కశపు ఆచారాలు ॥

మార్పు కోరె ఉద్యమాలు
మహిళారక్ష కేంద్రాలు
గడప దాటిన మహిళల్లో
ఆత్మవిశ్వాసపు సిరులు ॥

స్త్రీ జాతికి కొత్త మలుపు
అన్ని రంగాల్లో గెలుపు
ఆశయ ఆరోహణలవి
విజయ పథాలకిడె పిలుపు॥

నేడు..

విదేశ  వ్యామొాహ ఘనత
నాశనమౌతున్న యువత
డ్రగ్స్ , విస్కీల మత్తులో
చిత్తాయెను భరత భవిత ॥

మార్పది తెచ్చిన సారం
అవనిని నిండిన ఘొారం
కామంతో రగిలె జనం
స్త్రీ  బ్రతుకాయెను భారం ॥

పురుషుల అహంకారాలు
స్త్రీ ల పాలిటి శాపాలు
మాన మర్యాదల లోపం
మరచారు వావి వరుసలు ॥

స్వాతంత్ర్యము కోరె స్త్రీలు
భువి నీ జన్మ కారకులు
నాటికి నేటికి నతివకు
తగ్గలేదు వేధింపులు ॥

నేడు అతివ ఆట బొమ్మ.
సరదాల సందడి కొమ్మ
సాముాహిక హింసలతో
చావు రేవుల శవమమ్మ ॥

హామీ : ఈ మణిపుాసలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

No comments:

Post a Comment