24/05/2022.
మనుమసిద్ధి కవన వేదిక లో
మే 31వ తేదీ " పొగాకు వ్యతిరేక దినోత్సవం "సందర్భంగా..
అంశం : ధుామపానానికి దుారంగా..
శీర్షిక : మత్తు విడువరా .....
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఆకాశంలో నక్షత్రం పుడమి చెలి
కానరాక పొరుగురికి పయనమైంది.
మబ్బు పొరల్లో దాగిన తేమ
ఉక్కపోతకు ఉడికి ఆవిరౌతోంది.॥
పొగనిండిన పర్యావరణం ఊపిరాడక
స్వశ్ఛమైన గాలికై పచ్చదనాన్ని వెతుక్కుంటోంది.॥
పొగ బారిన పడిన మబ్బు మారాజు
కారుతుాన్న చమట చుక్కతో చినుకు
తడి అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాడు.॥
పొగ నిండిన వాతావరణంలో
పొడిబారుతున్న తేమకు
పుడమి సారం బీడుబారుతోంది ॥
పుాల తల్లి ఒడి నుండి విడివడిన పుప్పొడి
పొగాకు కంపులో పడి చిగురించ లేక
మట్టి గంధాల పచ్చ తడికై
వెతుకులాడుతోంది॥
చినుకు తడెరుగక మట్టిలో దాగిన
విత్తు చిన్నారి చిగురించే సత్తువ లేక
మొలకగానే ముడుచుకు పోయింది ॥.
ఆకాశం వైపు ఆశగా చుాస్తున్న రైతన్న
తడి మబ్బును కానరాక
తహతహలాడుతున్న గుండెతో
తడిలేని కన్నీరు కారుస్తున్నాడు.॥
ఇంతటి దుస్థితికి కారణమైన మనిషి
పొగాకు మాయలో పడి భయంకర
మత్తుకు అలవాటుపడిపోతున్నాడు.॥
మత్తు నిండిన మాయా ప్రపంచంలో
ఆడ మగా తేడాలేని ఆధునిక ప్రక్రియగా
పొంగి పొరలుతున్న పొగాకు వంటి
మాదక ద్రవ్యాల మత్తు మరిగిన
మనిషి , కేన్సర్ కణాలు నిండిన
కుళ్ళు దేహాలతో కమిలిపోతుా
భరత భవితకు పొగాకు పంటల
రుచుల పాఠాలు నేర్పుతున్నాడు॥
మారని మనిషి చర్యలకు" మడిని"
కోల్పోయిన ప్రకృతి , పర్యావరణ
రక్షణ లేని ప్రారబ్దానికి ధుామపానానికి
దుారంగా ఉండే చోటుకై
వెదుకులాడుతుా విసిగిపోతోంది.॥
************************:*:
24/05/2022.
మనుమసిద్ధి కవన వేదిక లో
మే 31వ తేదీ " పొగాకు వ్యతిరేక దినోత్సవం "సందర్భంగా..
అంశం : ధుామపానానికి దుారంగా..
శీర్షిక : మత్తు విడువరా...
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఆకాశంలో నక్షత్రం పుడమి చెలి
కానరాక పొరుగురికి పయనమైంది.
మబ్బు పొరల్లో దాగిన తేమ
ఉక్కపోతకు ఉడికి ఆవిరౌతోంది.॥
పొగనిండిన పర్యావరణంలో
ప్రకృతి పడతి పచ్చనం నిండిన
స్వశ్ఛమైన గాలికై ప్రాకులాడుతోంది.॥
పొగ నిండిన వాతావరణంలో
పొడిబారుతున్న తేమకు పుడమి
తల్లి బీడుబారి సారం కోల్పోతోంది ॥
ఆడ మగా తేడాలేని ఆధునికతగా
మాదక ద్రవ్యాల మత్తు మరిగిన
మనుషులు , కేన్సర్ కణాలు నిండిన
కుళ్ళు దేహాలతో కమిలిపోతుా
భరత భవితకు పొగాకు "పంట
సాగుకు పాఠాలు " నేర్పుతున్నారు॥
మారని మనిషి చర్యలకు" మడిని"
కోల్పోయిన ప్రకృతి మాత ,పర్యావరణ
రక్షణ లేని ప్రారబ్దానికి కన్నీరిడుతుా
ధుామపానానికి దుారంగా ఉండే చోటుకై
వెదుకులాడుతుా వీధీ వీధీ గాలిస్తోంది.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
No comments:
Post a Comment