Friday, May 20, 2022

Women writers లో రాసిన కవితలు.

[2/10, 20:45] p3: ఎంతో సమయాన్ని వెచ్చించి సాహిత్య రంగంలో 
కృషిచేస్తుా, రచయిత్రుల మనోభావాలను , వారి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటుా , వారికి తగిన ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ,ప్రేరణనుా కలిగించే బిరుదులతో సన్మానితులను చేస్తుా మహిళా మణులను  ప్రేరేపిస్తున్న  గౌరవనీయులు
" శ్రీమతి సునీత "గారికి మనఃపుార్వక ధన్యవాదాలు .🙏🙏.మరియు ఆశీస్సులు .🙌🙌

వారి వెన్నంటే ఉంటుా ఎవరి మనసుా నిప్పించని విధంగా సమీక్షలు చేస్తుా వారికి సహకరిస్తున్న 
గౌరవ సమీక్షకులకు ధన్యవాదాలు ..🙏🙏🙏🙏
.మరియు ఆశీస్సులు .🙌🙌🙌🙌.🙏

ప్రతీ వారం నిష్కల్మషంగా " సున్నితం "
విజేతలను ఎంపిక చేస్తుా అద్భుతమైన 
పత్రాలనందిస్తుా ప్రోత్సహిస్తున్న విశ్లేషకులు
శ్రీ భరద్వాజ రావినుాతల గారికి ధన్యవాదాలు 
.మరియు ఆశీస్సులు .🙌 🙏.

[2/12, 23:07] p3: బలేబలే అందాలుా సృష్టించావుా...
పాటకు పేరడీ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భలే భలే అందాలు కురిపించాయిా
మదిని మురిపించాయిా
మనసు కానందం, పొంగె పద గంధం 
కవిత కన్నెల్లు  ప్రతిదినం ॥

రాసిన వన్నీ రసమయ సుధలై
పుాసిన పుాలవోలే  వికసించేయిా..
మితమైన వరుసల ఆగమ సారమై
అందరి మనసుకుా హత్తుకున్నాయిా

 మకుటము నీదిగా, మన్నిక నీయగా॥
 నీనామపు  పరిమళాల జల్లులే
కవన వీధి విహరించాయిా ॥

విందులుగానిడు అంశము లెన్నో
జ్ఞానపు నిధులై   మది నిలిచాయిా
అభినందనలా బహుమతులెన్నో
విజయపు చిహ్నాలై ఊరించాయిా
సాహిత్యపు బడిలో సాధించిన బిరుదులే
మా మది కానందపు నిధులేై
కలలెన్నో పండించాయిా..॥
[2/18, 13:26] p3: ' 
18/02/2022.
శీర్షిక : మహిళా దినోత్సవం.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .కల్యాణ్.మహారాష్ట్ర .

ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని 
అన్ని రంగాల లోనుా 
మగవాడితో సమానంగా 
ఎదుగుతున్న మహిళలు  
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న  వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో  
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
 అనుబంధపు పరిమళాల పుాలు.
 ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
 ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత  మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు 
తరుణీ మణుల ఉద్యమ, వీర 
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.

నాటి నుండి  నేటి వరకు 
జరుగుతున్న ఎన్నో 
పోరాటాలకు  సాక్షిగా  ఎన్నో
మహిళా ఆరక్షణా కేంద్రాలు.
న్యాయ పరమైన చట్టాలు ,
మహిళా సంక్షేమ పథకాలుా 
నెలకొన్న ఘనత మహిళల
విజయానికి నిదర్శనాలు.
ఎన్నో అర్హతలతో బాటు 
మరెన్నో రంగాల లో 
ముందడుగేస్తుా దుాసుకుపోతున్న 
మహిళామణులకు స్ఫుార్తి నిస్తుా 
ప్రతి సంవత్సరముా జరుగుతున్న 
"మహిళాదినోత్సవం "మహిళా
శక్తి ప్రేరణకు దోహదమై
ఆత్మ విశ్వాసానికి నెలవై  
ముందడుగు వేయిస్తున్నదనుటలో 
సందేహములేదు.
జై మహిళా శక్తి : జై మహిళా స్ఫుార్తి.
[2/21, 15:05] p3: 21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

సాహితీ బృందావన జాతీయ వేదిక .

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు వెలుగు.

జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన అక్షర మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండు వేదం  ॥

శృతి లయల సంగీత గీతులు
కవుల కలమేలు ఫల రసాల తోటలు
వేద పురాణాది గ్రంధపు  తేటలు
తెలుగు భాషా వనములో 
పండిన  పసిడి పచ్చని పంటలు॥

నదీమతల్లుల సంగమ క్షేత్రాలు
ముక్కోటి వేల్పుల జేగుడి గంటలు
వేల పోరాటాల వీర చరితలు
తెలుగు సిగ నలరించు 
సుమ సౌగంధపు కీర్తులు॥

సంస్కృతి , సాంప్రదాయాల సారం
సత్య ,శాంతి .సద్ధర్మాలకు నిలయం 
ఐకమత్యానికి ప్రతీకగా ఎగిరే కేతనం 
తెలుగు జాతి  నిండు దనానికి నిదర్శనం 
తేనె లొలుకు మన తెలుగు భాష ॥

******************************
[4/28, 12:09] p3: 28/04/2022.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
అంశం : మగువ మహారాణి .
శీర్షిక : భరత చరితల భాగ్య విధాత.

కవిత:
------

తర తరాల చరితలను  తన కడుపులో 
తొమ్మిది నెలలు మొాసి తన రక్తాన్ని పంచి
పెంచి మనిషి మనుగడకు ప్రాణం పోసిన తల్లిగా
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥

దేశం బానిసత్వపు సంకెళ్ళలో బందీ అయినప్పుడు
ఎందరో స్వాతంత్రోద్యమ వీరులను కని, వారిని
దేశ రక్షణకై సగర్వంగా సమర్పించిన  తల్లిగా...
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
  
 దేశానికి వెన్నెముక వంటి 
 నిస్వార్ధ  పుత్రులను కని ,
అందరి ఆకలినీ తీర్చగలిగే 
అన్నదాతలను కన్న తల్లిగా
మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
 
 దుష్ట శిక్షణ  శిష్ట రక్షణ  చేసేందుకై
 ఘన చరితలు గల పురాణ పురుషులను కని
 తరించిన తల్లిగా జగదంబగా జేలందుకుంటున్న
 మహిమాన్విత చరితగల మగువ మహారాణియే॥
 
 వేయేల ! అమ్మను మించిన ఇలవేల్పులేదు.
 స్త్రీ ని మించిన త్యాగముార్తి లేదు.
 భరత మాతగా, భరత చరితల భాగ్య విధాతగా 
 మగువ ఎప్పటికీ మహారాణీయే ॥



హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
[5/1, 06:29] p3: 01/05/2022

అంశం : కార్మిక దినోత్సవం .
శీర్షిక  : శ్రామిక జీవనం .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

కష్ట పడనిదే కడుపు నిండని దౌర్భాగ్యం.
కాయ కష్టమే జీవితమైన  బడుగు జీవితం.
మనిషికో తలరాత రాసిన విధి విలాసం.
బలహీన వర్గాల బ్రతుకు తెరువు మార్గం ॥

కొందరు తిని పారేసిన పోగు చెత్త పని
మరి కొందరి ఆకలి తీర్చే ఖని.
బాధ్యత లేని బలసిన వాడల్లో
పులిసిన ధనానికి నిదుర లేమి పని. ॥

కలుషిత వ్యర్ధాల కర్ఖానాలలో కాలి-
కమిలిన  కష్ట జీవుల చమట ఫలం
అందమైన సామగ్రిగా అంతరాల
అంతస్తుల్లో మెరుస్తున్న వైనం.॥

పొట్ట నిండని వేతనాలతో 
వాడలుతున్న వేల కార్మికుల 
ఆకలి తీరని దైన్య జీవితం  ॥
ఎదుగు బొదుగు లేని కార్మిక
జీవితాల  కన్నీటి కథనం ॥

పార పలుగుల పరుగు కష్టానికి
కుాడు గుాడు కరువైన ఆక్రోశం .
అన్నదాతలై అలసిన ఖర్మానికి
వెన్నెముక విరిగిన రైతన్న శోకం ॥

శ్రమ జీవుల అస్థిత్వం లేని రోజు
జన జీవితం రోగాలు నిండిన తరాజు॥
కార్మికుల కష్టాన్ని గుర్తించిన రోజు
నిజమైన మానవత్వానికి  
మకుటం పెట్టిన రోజు.॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.
[5/12, 22:51] p3: శీర్షిక : అమ్మే అంతా....
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమ్మ  రక్త మంసాలతో నిండిన బొమ్మవు.
క్షీరామృత ధారలతో జీవం పొందిన ఘనవు
అమ్మ ఒడిలో అందలాలనేలిన ధన్యుడవు ॥

పిల్లల కోసం  పరితపించేది అమ్మ.
పెంపకంలో ఆనందపడేది అమ్మ .
అమ్మ పిల్లలకో ఆట బొమ్మ .॥

రాత్రి పగలుల నిదుర లేమి కష్టం
పిల్లల బోసినవ్వులలో సేద తీరిన ఇష్టం.
పెరిగే పిల్లలకు అమ్మ ఒక నేస్తం ॥

పిల్లల ఆట పాటలు అమ్మకు అనందం 
స్కుాలుకు పంపేక బాధించే ఒంటరి తనం  .
వారి నడతకు అమ్మే ఒక ఆదర్శం॥

పెద్దయ్యే పిల్లలు  తల్లికొక సవాలు.
వారి బ్రతుకు చింత అమ్మ మధనకు కారణాలు.
వారి వైవాహిక జీవిత స్పర్ధలు అమ్మకు శాపాలు॥

కరిగి పోయిన కొవ్విత్తిలా అమ్మ
అరిగిపోయిన ఎముకలు నిండిన బొమ్మ 
అమ్మ ఋణం తీర్చుకోవాలి సుమ్మ .॥

హామీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన ॥
[5/20, 08:19] p3: 20/05/2022.
శీర్షిక  : పర్యావరణ రక్షణ స్వీయ రక్షణ .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : వచన కవిత.

విలవిలలాడే రోదనతో విశ్వం కంపిస్తోంది.
విశ్వ మామవ వినాశనానికి
కాలుష్యం  కంకణం కట్టుకుంది॥

రసాయనాలు, పురుగులమందుల 
వాడకాలతో మట్టి పొరల చాటులో 
మాటు వేసిన విష కీటకాల వీర విహారం ॥
 
రోగాలు నిండిన జన్మలకు 
 విషపుారితమైన ఆహారాలు కారణం .
వృక్షాల జాడ కానరాని ప్రకృతిలో
 పర్యావరణ రక్షణ లేని ప్రారబ్దం జీవితం ॥
 
పచ్చదనం కోల్పోయిన ప్రకృతిలో 
ఆక్సిజన్ కరువైన హా హాకారాలు.
పర్యావరణ రక్షణ లేక 
పెరుగుతున్న కాలుష్యాలు.॥

దేశంలో నిండిన స్వార్ధ కుతంత్రాకు
గుట్టలైన శవాల కుళ్ళు వాసనలు ॥

పలు  రసాయనాల  పారవేతలతో 
గంగమ్మ ఒడి నిండిన విష వ్యర్ధాలు
విష జలాల వాడకాలతో -
జన జీవితాల్లో రోగాలు రొష్టులు॥.

 విష కణాల వింత వ్యుత్పత్తి  దాడులతో
కరోనా కాట్లతో పెరుగుతున్న దారుణాలు.
సాముాహిక రాసాయనిక దాడులకు 
సారం కోల్పోతున్న పుడమి తల్లి కన్నీటి కథనాలు॥


హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితముకాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment