10/06/2022.
మనుమసిద్ధి కవన వేదికలో
ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.
శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
చెదరని గంభీరాకృతి
ధృడ సంకల్పానికి ప్రతీతి
లక్ష్యం నిండిన బాధ్యతలకు
వెనుకాడని నాన్న ప్రవృత్తి ॥
బంధాలే బాధ్యతగా
అలసటలే సుఖాలుగా
పిల్లల భవితోన్నతులే
ఆనందాలైన వ్యక్తిత్వ రీతి ॥
సుఖమన్నది కోరడెపుడు
అలుపన్నది ఎరుగడెపుడు.
బాధ్యత నిండినబరువుకు
అసహనంతో కుంగడెపుడు ॥
మన జన్మకు కారకుడు
మన కోర్కెలు తీర్చువాడు
మార్గదర్శి యై మసలెడు
మంచి గురుని రుాపమతడు.।॥
సంసారము సాకుటకు
తన పిల్లల భవిత కొరకు
తన సుఖములు పణముగనిడు
నాన్న నిండు త్యాగముార్తి ॥
కర్షకుడై కార్మికుడై
భరత మాత రక్షకుడై
నిరంతరం కష్టపడే
నిదురెరుగని శ్రామికుడు॥
నాన్న రుాపములో దేముడు
అవని నవతరించి నాడు
నా పిలుపుకు స్పందించీ
నన్ను గాచు "హీరో" అతడు॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన .
********************
ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.
శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
నా నవ్వుల తోటకు నాన్న నీరు పొిసినాడు
నేనడిచే బాటలోవబాధ ముళ్ళు తిసినాడు॥
నే కోరిన కోర్కెలన్ని మమత నింపి తీర్చినాడు
నే నెదిగే బాట జుాపి భవిత తీర్చి దిద్దినాడు ॥
ఎండైనా వానైనా కష్ట మంత ఓర్చునతడు.
అహర్నిశలు శ్రమియించే అలుపెరుగని యంత్రమతడు॥
నా జన్మ దాతగా జగతి మార్గదర్శిగా
నను నడిపే సారధిగా వెంటున్నది నాన్నేగా॥
నా కలలకు సాకారం నా భవితకు సహకారం
నాన్న లేని జీవితమే ఉనికిలేని ప్రయాణం ॥
కడుపు నింపి కాన్కలిచ్చి చదువుా సంస్కారమిచ్చి
నిలకడైన భవిత నొసగు నిత్య శ్రామికుడాతడు॥
నాన్న లేని బ్రతుకు సారో ! నాన్న లేని ఉనికి జోరో
నాన్న మించు వారు లేరు । నాన్నే నా సుాపర్ హీరో ॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన .
********************
****************:*
ఫాదర్స్ డే సందర్భంగా రాసిన కవిత.
అంశం : నాన్నే నా హీరో.
శీర్షిక : అలుపెరుగని శ్రామికుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
నా బోసినవ్వులు కురిసే వెన్నెలలను
తన ఆశల పల్లకిలో పరుచుకొని
నా ఉనికి ఉత్సాహాన్ని ఆశయాల--
ప్రపంచానికి పరిచయం చేసినది నాన్న ॥
నా చిన్ని చిలిపి చేతల అసహనాన్ని
రాత్రి చెప్పే కధల రుాపాలకు జోడించి
నా తప్పుల ఆచరణకు ఒప్పుల నడవడిక
నేర్పిన మొదటి మార్గదర్శకుడు నాన్న ॥
నా చిన్ని కలల ప్రపంచాన్ని' నాకై
ఇలలో చుాపించేందుకు తన కష్టాలను
ఇష్టాలుగా మార్చుకొనే పోరాటాల ప్రతి
మాంత్రికుడు మా నాన్న॥
నే నడిచే ఎండకు గొడుగై , నేనాడే మాటకు
మంత్రమై, నా ఉజ్జ్వల భవితకు
ఆలంబనై నా నవ్వుల ఆనందాన్ని
ఆస్వాదించే అనుభవ సారం నాన్న ॥
అలుపెరుగని అహర్నిశల పోరాటాన్ని
జీవిత ఒడిదుడుకుల ఒరవడి గెలుపుగా
నా ఆశయాల నెరవేర్పుకై అందించిన
ఆశయ సాధకుడు మా నాన్న ॥
నాన్న నా అనుభవాల గెలుపుకు వేరు
నాన్న నా జీవిత గమనానికి చుక్కాని జోరు
నాన్న నా ఆనందాల తోటలో మొలకెత్తే నారు
అందుకే నాన్న ,హీరోను మించిన యాక్షన్ ష్టారు.॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన .
********************
***************
No comments:
Post a Comment