12/06/2022.
గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.1 కొరకు
అంశం : ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర.
శీర్షిక : అందరికీ అందుబాఁటులో సాహిత్యం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
తమ మనోగత భావాలను అక్షరాలకు జోడించి కల్పన , కల్పనేతర వర్గాలలో నవరసాలనుా సుాక్ష్మంగా వ్యక్తపరచే వర్ణనాపుారిత అక్షర సాన్నిహిత్య సారాశం కవిత్వం .
ఒకప్పటి రామాయణ మహాభారతాది చారిత్రాత్మక వర్ణనలు మౌఖిక సంప్రదాయ సంస్కృతులననుసరించి
ధారణానుకూలమైన కార్యాచరణతో వచన కవిత్వంగా వర్ణింపబడి ఉండేవి.।
మరికొన్ని నియమబద్ధమైన ఛందస్సుతో యతి ప్రాసానుప్రాసలతో కుాడిన క్రమ బద్ధమైన పాదాలతో పద్యరుాపంలో రచింపబడ్డాయి.I
వాటిలో ఎన్నో ధార్మిక,సందేశాత్మకత కవిత్వాలు , జాతీయ ఇతిహాసాలు, తాత్విక గ్రంథాలు , శృంగార కావ్యాలు వంటి వివిధ సాహిత్యాంశాలు కవిత్వ
రుాపంలో వెలుగు చూశాయి.l
రాను రానుా ,కాలానుకుాలంగా ఈ ఆధునిక యుగంలో గ్రాంధీక భాషా ప్రయొాగాలు తక్కువై అందరికీ అర్ధమయ్యే రీతిలో వాడుక భాషా శైలి ననుసరించీ సాహిత్యం యొక్క పలు విలక్షణతలు ఉద్ఘాటింపబడ్డాయి .
పలు ప్రక్రియలు నియమపుారిత లక్షణాలతో వెలువడడంతో సాహిత్యం విలువ ఒక పటిష్టమైన పద్ధతిలో నూతనత్వానికి దోహదమయ్యింది.l
విజ్ఞానం , సరళ భాషా ప్రాధాన్యతల ఆధారంగా, అందరికీ అందుబాటులో గల సాహిత్య ప్రక్రియల
విభాగంలో సమీక్షాకరణ అనేది చోటు చేసుకొంది.
రాసే ఏ ప్రక్రియ యైనా కవియొక్క భావ ప్రకటనతో
పలువురినీ ఆకట్టుకొనే విధంగా ఉండాలన్నదే ఈ సమీక్షయొక్క సారాంశమై ఆధునిక కవిత్వ పురోగతికి
మాధ్యమమయ్యింది.
ఈ పద్ధతిని ఉపయోగించడం వలన సాహిత్యంలో
ఒక నూతనత్వం అభివృద్ధి చెందడమేకాక ,
మనం రాసే సాహిత్య సారం కవితాత్మకంగా మెరుగుపడుతుందనడానికి ఏమాత్రముా సందేహం లేదు.l
హామీపత్రం:
ఈ కథానిక కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది అని ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన అని తెలుపుతున్నాను .
(ఎంతో అధ్యయనం చేసి ఎన్నో నుాతన ప్రక్రియలను
మనకందించి మనలో కవిత్వాకాంక్షను కలిగించిన నేటి ఆధునిక సాహిత్య రుాపకర్తలకు మనఃపుార్వక ధన్యవాదాలతో 🙏🙏 .)
No comments:
Post a Comment