Saturday, June 25, 2022

డాక్టర్స్ డే కవితలు

24/06/2022.
మనుమసిద్ది కవన వేదిక ఆధ్వర్యంలో జులై 1,డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కవితల పోటీ కోసం...


అంశం : ఊపిరి నేతగాళ్ళు.
శీర్షిక  :  నర నారాయణుడు.
ప్రక్రియ : వచన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


వైద్యులు, పవిత్ర వైద్య వృత్తికి ప్రతీకలు.
రోగగ్రస్తులను ఆదరించే ఆప్త మిత్రులు .
రోగులకు సరియైన వైద్యాన్నందించే దార్శనికులు. 
ఆరోగ్య జీవితాన్నందించే అభినవ ధన్వంతరులు॥

ఔషధం ఇవ్వడంలో తగిన జాగర్త
ఆపరేషన్స్ చేయడంలో చుాపే నిబద్ధత
అలుపెరుగని నిరంతర సేవాతత్పరత
 జాగురుాకతతో మెలగే వైద్యుని ఘనత ॥

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రెండవ- 
ముఖ్య మంత్రిగా ప్రసిద్ధులు.
స్వాతంత్ర్య సమర  యొాధులు . 
వృత్తి రీత్యా చరిత కెక్కిన వైద్యులు.
డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ధన్యులు. ॥

ఈయన సేవలకు గాను భారత ప్రభుత్వం
ఇచ్చిన దేశ అత్యున్నత "పౌర పురస్కారం,"
" భారతరత్న" గా చేసెను ఘన సన్మానం ॥

ఆతని జయంతి రోజే ఆయన వర్ధంతి .
జూలై 1  భారతదేశమంతటా జరిగే జయంతి.
జాతీయ వైద్య దినోత్సవం నమందరి స్ఫుార్తి 
ఆరోగ్యదినోత్సవం వైద్యులందరి ఘన కీర్తి. ॥

 
హామీ పత్రం : ఈ కవిత అనువాదం,అనుసరణ 
కాని నా స్వీయ రచన . హామీ ఇస్తున్నాను.

********************::::*********
24/06/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం :  ఐచ్చికం 

మ.సా.క.సం.19
కవిత సంఖ్య : 3

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక  : తెల్లకోటులో దాగిన దర్పం .

ఆతని మాటలతో రోగాన్ని జయింగల ధైర్యం
ఆతని స్మర్శతో రోగులలో పెరిగే ఆత్మ స్థైర్యం.
 అలమటిస్తున్న రోగులకు అన్నీ తానైన ఘనం
అతనిచ్చిన ఔషధం రోగాలను బాపే అమృతం ॥

తెల్ల కోటులో దాగిన దర్పం, అతని
స్వశ్ఛత నిండిన  మనసుకు నిదర్శనం  .
 మెడలో స్టెతస్కోప్, విద్యార్హతకు ఫలం.
 అతడే రోగులను గాచే విధాతైన వరం  ॥

శస్త్ర చికిత్సకు నైపుణ్యత నిండిన చెేతి వేళ్ళు.
సునిశిత దృష్టిగల వ్యవస్థీకృత కార్యాచరణలు
 బ్రతుకు ఊపిరినల్లే బలమైన నేతగాళ్ళు.
 సమర్ధవంతమైన కార్య కర్తలు వైద్యులు ॥
 
పగలుా రాత్రీ సేవలందించే వృత్తి , సేద్యం.
బీదా గొప్పా తేడా చుాపని సమానతల భావం
ఆరోగ్యమే మహా భాగ్యమంటుా చేసిన వైద్యం
వైద్యుడే ఇల వెలసిన  దైవానికి ప్రతిరుాపం.॥

"డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నిలబెట్టెను వైద్యుల ఘనం
ఆతని జయంతి రోజే ఆయన వర్ధంతి దినం
జూలై 1ని జరుపుకొనే జాతీయ వైద్యుల దినోత్సవం 
వైద్యుల సేవాతత్పరతకు  ఇదే నా వందనం ॥


హామీ పత్రం : 
నా ఈ కవిత అనువాదం,అనుసరణ 
కాని నా స్వీయ రచన . 

No comments:

Post a Comment