10/07/2022.
తెలుగు వెలుగు కవితల పోటీ కొరకు,
అంశం : ప్లాష్టిక్ పై సమరం .
శీర్షిక : చేయిా చేయిా కలుపుదాం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర
ఆకర్షణీయమైన రంగులతో అలరిస్తున్న
హానికరమైన ప్లాష్టిక్ వాడుకలో ప్రమాదాలు .
ఉపయొాగకరమైన వస్తువుల తయారీలలో
మఖ్యమైనవిగా, ప్లాష్టక్ సంచుల వాడకాలు.॥
ప్లాష్టిక్ తయారీలో విచక్షణారహితంగా
ఉపయోగించే రసాయనాలు. అందువల్ల
కలుగుతున్న పర్యావరణ సమస్యలు .
కరగని ప్లాష్టిక్ తో కనిపింని కఠిన రోగాలు ॥
పారుదల లేక ముాసుకు పోతున్న కాల్వలు.
మురిగిపోతున్న నీటిలో ముసురుతున్న దోమలు .
వ్యాపిస్తున్న మలేరియా డెంగ్యుా వంటి
భయంకరమైన విషపుారిత వ్యాధులు. ॥
ఉత్పత్తియౌతున్న కరోనా వంటి విష కణాలు
మందులేని మహమ్మారులతో జన పోరాటాలు.
ప్లాష్టిక్ వాడకాలు నిషేధమన్న నినాదాలు .
ప్లాష్టిక్ తయారీలను నిలిపివేయని జనాలు ॥
ఎన్నాళ్ళీ కఠిన కాలుష్య పోరాటాలు.
ఆపి వేయండి ప్లాష్టిక్ వస్తు వాడకాలు.
కలసి చేయండి పర్యావరణ రక్షణకై ప్రమాణాలు.
ప్రత్యామ్నాయంగా వాడండి జనపనార , గుడ్డ
లేదా కాగితపు సంచులు.॥
అనేక రాష్ట్రాల లో ప్లాష్టిక్ నిషేధాల తీర్మానాలు.
అందరుా మానండి ప్లాష్టిక్ సంచుల వాడకాలు.
మన నడవడికలే మన భవితకు మన మిచ్చే
ఆరోగ్యకర తీర్మానాలు ॥
హామీ : ఈ వచన కవిత నా స్వీయ రచన.
No comments:
Post a Comment