Saturday, June 25, 2022

సైనికులకు వందనం

15/06/2022..(.సుారేపల్లి రవికుమార్ వాట్సప్ లో)
నవభారత నిర్మాణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీల కొరకు,

శీర్షిక : దేశ రక్షకులకు వందనం.
.

రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

దేశ సరిహద్దు సంరక్షకులు,
శత్రు మూకలకు వెన్నుచూపని ధీరులు
ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. '
శౌర్యానికి ప్రతీకలు మన భరత దేశ సైనికులు ॥

శారీరక ధృడత్వము ,మానశిక నిశ్ఛలత్వము
దేశ రక్షకునికి అత్యవసరమైన అర్హతలుగా
తమ ప్రాణాలను సైతం దేశ రక్షణకై
ఆనందంగా అర్పించగలిగిన అమర వీరులు ॥

మాతృదేశ రక్షణే ధ్యేయంగా మన సైన్యం
ప్రకృతి వైపరీత్యాలలో సడలని ఆత్మస్టైర్యం
పగలు రాత్రుల తేడాలేని కర్తవ్య పాలనం.
అదే వారి విలువైన దేశ భక్తికి నిదర్శనం ॥

అనుబంధం ఆప్యాయతలకు అందనంత దుారం.
బంధు మిత్రుల ప్రేమకు నోచుకోని ఒంటరితనం
కంటి మీద కునుకెరుగని కఠిన  జీవితం .
దేశ రక్షణకై అతని పుార్తి జీవితం, అంకితం ॥

అనుక్షణం అప్రమత్తత నిండిన చుాపులు
దేశ రక్షణకై భాద్యత నిండిన కర్తవ్య నిష్టులు
యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టగల వీరులు
దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు '॥

క్రమశిక్షణ, ఆరోగ్యరక్షణ ,సమయపాలనం
సైనికుల నిత్య జీవితంలో నిష్ట నిండిన నియమం
దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోరాడే ధైర్యం
అమరులైన సైనికులకు చేద్ధాము గౌరవ వందనం ॥

హామీ:
ఈ నా  వచన కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment