Saturday, June 25, 2022

విశ్వ విఖ్యాతుడు

అంశం : N.T.రామారావు.
శీర్షిక : విశ్వ విఖ్యాతుడు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఎందరో పుడతారు. మరెందరో గిడతారు.
కొంతమంది మాత్రమే చరిత పుటల కెక్కుతారు ॥

నందముారి అందగాడు తారక రామారావు
జీవితాన ఒడిదుడుకుల బాట నడచి గెలిచినాడు ॥

పల్లెటుారి పిల్లగాడు పలు భాషలు నేర్చినాడు
రంగమంచ్ మీదాతడు రంగు లేసి నిలచి నాడు॥

విజయావారి చిత్రాలకు విజయము చేకుార్చినాడు.
బాక్సాఫీస్ విజయాలతొ ప్రజాదరణ పొందినాడు.॥

రాముడతడె భీముడతడె రస భుామికలేలె నతడె.
క్రమశిక్షణ నిండినట్టి కధల నాయకుండాతడె ॥

కుంచెపట్టి పంచకట్టి కుాచిపుాడి నేర్చినాడు
దర్శకత్వ మేలీ ,ఘన చిత్ర సీమ నేలినాడు ॥

తడబడుటలు లేని వాడు మాయాబాజారు తోడు
నలుదెసలా కీర్తుల ఘన నటుడై నిలిచాడు చుాడు ॥

రాముడుా, కృష్ణుడంటి పౌరాణిక పాత్రలతో
తెలుగు వారి హృదయాల లొ శాశ్వతముగ నిలచినాడు॥

పట్టభద్రులైన వారు ప్రగతి బాట నడచినారు
ప్రజల ముఖ్య మంత్రియై తెలుగు గడ్డ నేలి నారు॥

సరి రారసలెవ్వరతని గాంభీర్యపు గొంతు వాని
ప్రజలు మెచ్చు నాయకుడై అన్నగాను నిలచినాడు ॥

పౌరాణిక, జానపదము,సాంఘీకపు చిత్రాల- వై
విధ్యభరిత పాత్రలెన్నో వేసీ గెలిపించినారు. ॥

నవ రసాలు పండించిన నటసార్వభౌముడు
విశ్వ విఖ్యాతుడై  జగతి చరిత కెక్కినాడు ॥

పద్మ శ్రీ ఆవార్డు దక్కె కళప్రపుార్ణ స్వీకరించె
డాక్టరేటు గౌరవముతొ ఘన సత్కారములు పొందె ॥

నందముారి వంటి నటుడు కానరాడు ఇంకెన్నడు
దివిని భువిని అతడొక్కడె నట సార్వబౌముడు ॥

హామీ :
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన .

***************************************


No comments:

Post a Comment