26/07/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక : నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
మ.సా.క.స : 19.
కవిత సంఖ్య : 2.
మంచి చెడు తేడాలు తెలుసుకొని మసలుకో
మానవత్వ విలువలు నిలుపుకొని నడుచుకో
మనిషై పుట్టినీవు పశువులాగ మారకు
బంధానుబంధాలను కలుపుకొని నిలుపుకో ॥
కుార్చొని తింటే కొండలే కరుగుతాయి
అతిగా తింటే కండలే పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు మందులే తొలగుతాయి.॥
మనిషిని మనిషిగా ప్రేమించాలి .
కుల మతాలు విధిగా విడవాలి.
ఒకరికి ఒకరై ఆనందంగా బతకాలి
వసుధైక కుటుంబముగా మెలగాలి ॥
నవ్వితే నాలుగు విధాల చేటంటారు.
ఏడిస్తే , నవ్వడమసలు రాదంటారు.
మంచితనానికి విలువనివ్వరు ఎవ్వరుా
మనిషికసలు మనసన్నదే లేదంటారు ॥
*************************
No comments:
Post a Comment