Friday, July 29, 2022

మహతీ సాహితీ కవి సంగమంలో

28/7/22
అంశం:- వెన్నెల రాత్రి
ప్రక్రియ:-ఇష్టపదులు .

శీర్షిక:- అందాల చెలికాడు .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

ఆకాశమందున్న  అందాల చెలికాడు
అందరిని మురిపించు ఆ వెన్నెలకు రేడు॥ 
కలలలో మురిపించు కధలెన్నొ చెపుతాడు.
కురిపించ వెన్నెలను కులుకుతుా వస్తాడు ॥

ఆతన్ని రాకతో అవనిలో అందాలు 
అరవిరిసి పుాస్తాయి ఆ కలువ భామలుా ॥
శృంగార తలపులను రంగార పండించి
 విరహాలు రేపుచుా  విందారగిస్తాడు ॥

అందాల జాబిల్లి కురిసేటి వెన్నెల్లు
ఆబాల గోపాలు  కానంద పరవళ్ళు
మల్లి ,జాజులతోడ  వెల్లివిరిసెను తోట 
పసిడి చంద్రుడె కాద పసి పాపలకు పాట॥

హాయి వెన్నెల రేయి ఆట పాటల కోయి
ఆ జంట ప్రేమికుల నలరించు  వలపోయి
జగములో ఈశ్వరీ జాబిల్లిడే హాయి
అనుభవించిన దోయి  అదె నేటి కవితోయి ॥






No comments:

Post a Comment